Virat Kohli : రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62* పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సాల్ట్(65) 33 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో విధ్వంసం సృష్టించాడు.. సాల్ట్ అవుట్ అయిన తర్వాత దేవదత్ పడిక్కల్ 28 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 40* పరుగులు చేశాడు.. తద్వారా రాజస్థాన్ రాయల్స్ జట్టు విధించిన 174 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 17.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. తద్వారా ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన 6 వికెట్ల ఓటమిని ఈ విజయంతో బెంగళూరు భర్తీ చేసింది. అంతకు ముందుకు రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లు పూర్తి స్థాయిలో ఆడి 173 రన్స్ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్ (75) అదరగొట్టాడు. బెంగళూరు బౌలర్ల పై విశ్వరూపం చూపించాడు. రియాన్ పరాగ్(30), ధ్రువ్ జూరెల్(35*) పర్వాలేదనిపించారు. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, కృణాల్ పాండ్యా, హాజిల్ వుడ్ తలా ఒక వికెట్ సాధించారు.
Also Read : విరాట్ కోహ్లీని ఇంత బాధలో ఎప్పుడూ చూడలేదు.. వైరల్ ఫొటో
ఒకే ఒక్కడు విరాట్..
ఇక ఈ మ్యాచ్లో 62 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. టి20 లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా ఆవిర్భవించాడు.. మొత్తంగా టి20 లలో 100 హాఫ్ సెంచరీలు చేసి ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో డేవిడ్ వార్నర్ కొనసాగుతున్నాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 108 హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజాం కొనసాగుతున్నాడు. ఇతడు 90 హాఫ్ సెంచరీలు చేశాడు. గేల్ 88 హాఫ్ సెంచరీలు చేసి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. జోస్ బట్లర్ 86 హాఫ్ సెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ ఫార్మాట్లో విరాట్ సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో.. త్వరలో డేవిడ్ వార్నర్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ” విరాట్ ఈ ఫార్మాట్లో అదిరిపోయే రేంజ్ లో ఆడుతున్నాడు. వయసు పైపడుతున్నా కొద్దీ అతడిలో ఊపు పెరుగుతోంది. అందువల్లే పరుగుల వరద పారుతున్నది. మిగతా మ్యాచ్లో కూడా విరాట్ ఇదే స్థాయిలో ఆడితే సరికొత్త రికార్డులు సృష్టిస్తాడు. తనది కాని రోజు కూడా విరాట్ అద్భుతంగా ఆడుతాడు. అందువల్లే అతడికి రికార్డులు పాదాక్రాంతం అవుతున్నాయి.. క్రికెట్ ప్రపంచానికి అతడిని కొత్తగా చూపిస్తున్నాయని” విరాట్ కోహ్లి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఐపీఎల్ లో ఒకే ఒక్కడిగా విరాట్ కోహ్లీ.. ఆ రికార్డు ఎవరికీ సాధ్యం కాదు