విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రం, అనుపమ పరమేశ్వర్ కలిసి ‘బైసన్’అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీస్ స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో దృవ విక్రమ్ కబడ్డీ ప్లేయర్గా కనిపించనున్నాడు. ధ్రువిక్రమ్ సినిమాలో నటించింది తక్కువ అయినా రియల్ గా చాలా విషయాల్లో పాపులర్ అయ్యారు. ఈయన కోలీవుడ్లో ఆదిత్య వర్మ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాకి రీమేక్. ఈ సందర్భంగా ఈ యంగ్ హీరో ఓ పాట కూడా పాడారు. ఆ తర్వాత ఓ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడు కూడా.
అయితే తాజాగా ధ్రువ్ విక్రమ్, అనుపమ కేర్తో కలిసి లిప్ లాక్ ఉన్న ఫోటో బయటకు వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు షికార్లుగా మారినాయి. చాలామంది వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలు చూస్తే ప్రైవేట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం సినిమాలోని సీన్లో భాగమే అని అంటున్నారు. సినిమాలోని సీన్లో భాగమే అయితే అఫీషియల్ గా విడుదల చేస్తారు కదా అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా విరివి ఇద్దరి మధ్య ఈ ఫోటో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ పిక్ పై అటు ధ్రువ్ విక్రమ్ లేదా అనుపమ కేర్ స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదు. అయితే అనుపమ కేర్ గతంలో చాలా సినిమాల్లో హాట్ సీన్లలో నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో మరింతగా రెచ్చిపోయినట్లు చర్చించుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం సినిమా ప్రమోషన్స్ కోసం ఈ ఫోటోను రిలీజ్ చేశారని అంటున్నారు. అయితే ఈ ఫోటోలో మాత్రం లోకాన్ని మర్చిపోయి లిప్ లాక్ లో మునిగిపోయినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోటోను వారే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటప్పుడు మూవీకి సంబంధించినది అయితే ఇతరులు తీస్తారు కదా అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటోపై క్లారిటీ వచ్చేవరకు సోషల్ మీడియాలో హాట్ హాట్గా చర్చ జరుగుతూనే ఉంటుంది.