IPL 2025 Playoffs: ఐపీఎల్ లో మొత్తం 70 మ్యాచ్లు జరుగుతాయి. ఇప్పటివరకు 55 మ్యాచ్లు పూర్తయినప్పటికీ.. ప్లే ఆఫ్ విషయంలో ఇంతవరకు ఒక స్పష్టత రావడం లేదు. ఐపీఎల్ లో నిర్వహించే ప్లే ఆఫ్ లో నాలుగు జట్లు పోటీ పడతాయి. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు అఫీషియల్ గా గ్రూప్ దశ నుంచి ఎగ్జిట్ అయిపోయాయి. ఇక ప్లే ఆఫ్ కు సంబంధించి ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. టాప్ 4 స్థానాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. 15 పాయింట్లతో పంజాబ్ రెండో స్థానంలో ఉంది. 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. 14 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ నాలుగు స్థానంలో ఉంది. 13 పాయింటులతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదవ స్థానంలో ఉంది. 11 పాయింట్లతో కోల్ కతా నైట్ రైడర్స్ ఆరో స్థానంలో ఉంది. పది పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్ ఏడవ స్థానంలో ఉంది. ఒకరకంగా కోల్ కతా, లక్నో ప్లే ఆఫ్ వెళ్ళాలంటే అద్భుతాలతో పాటు.. ఆ జట్లు భారీ వ్యత్యాసంతో విజయాలు సాధించాలి. ఇక ఢిల్లీ జట్టు కూడా తన తదుపరి అన్ని మ్యాచ్లు గెలవాలి. ఇక బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లడం లాంచనమే అయినప్పటికీ.. ఐపీఎల్ లో ఏదైనా జరగొచ్చు. పంజాబ్ కూడా 15 పాయింట్లతో బలమైన స్థానంలోనే ఉన్నప్పటికీ.. అనుకొని అవాంతరం ఎదురైతే ఆ జట్టు భవితవ్యం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.
Also Read: పదేళ్ల దరిద్రాన్ని..ఒక్క సీజన్ లో మార్చేశాడు.. ప్రీతి జింటా హగ్ ఇవ్వాల్సిన సందర్భం!
మిగతా జట్లపై ప్రభావం
ఈ సీజన్లో హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై జట్లు గ్రూప్ దశ నుంచి ఎగ్జిట్ అయినప్పటికీ.. ఇంకా మూడు చొప్పున ఆ జట్లు మ్యాచులు ఆడాల్సి ఉంది. అప్పుడు అవి వరుసగా విజయాలు సాధిస్తే.. మిగతా జట్ల పై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ఆ మిగతా జట్లు ప్లే ఆఫ్ వెళ్లే విషయంలో అవాంతరాలు ఎదురవుతాయి. అందువల్లే ఈ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది అనే విషయంపై ఒక స్పష్టత రావడం లేదు. ఒకవేళ హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై జట్లు గనుక విఫలమైతే అప్పుడు వాటితో పోటీపడి గెలిచిన జట్లకు ప్లే ఆఫ్ వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. చూడాలి మరి వచ్చే మ్యాచ్లలో ఏం జరుగుతుందో.. గతంతో పోల్చి చూస్తే ఈ సీజన్లో మ్యాచ్లన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. అందువల్లే ప్లే ఆఫ్ సమీకరణాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. గ్రూప్ దశ ముగిసే వరకు వెళ్తుందనే విషయంపై ఒక అంచనాకు రావడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: ఐపీఎల్ లో అత్యంత చెత్త జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరంటే?