IPL 2025 Rescheduled: ప్రతి సీజన్లోనూ కొత్త స్పాన్సర్లను వెతుక్కోవడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సరిపోతుంది. స్పాన్సర్లు దొరికినప్పటికీ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశించిన స్థాయిలో మాత్రం ఆదాయం రావడం లేదు. అయినప్పటికీ తప్పనిసరి తద్దినం లాగా పిసిఎల్ ను నిర్వహిస్తోంది. ఇక ఇటీవల కాలంలో పహల్గాం ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో.. భారత్ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద తాండాలపై దాడులు మొదలుపెట్టింది. పాకిస్తాన్లో ప్రధాన నగరాలలో మిస్సైల్స్ వర్షం కురిపించింది. తద్వారా పాకిస్థాన్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న పిసిఎల్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో పాకిస్తాన్ పిసిఎల్ ను దుబాయ్ వేదికగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు ప్రారంభంలోనే ముగిసిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిసిఎల్ నిర్వహించే అవకాశం లేదని ఎమైరేట్స్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ కు స్పష్టం చేసింది.. దీంతో పిసిఎల్ నిర్వహించే పరిస్థితి లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైలెంట్ అయిపోయింది. ఇక ఇదే క్రమంలో రెండు దేశాల మధ్య ఫైరింగ్ ఆగిపోవడం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్త ఊపిరి పీల్చుకుంది.
Also Read: భారత్ – పాక్ ఉద్రిక్తతలు.. దాయాది దౌత్యవేత్త బహిష్కరణ
ఎప్పటినుంచి రిస్టార్ట్ అంటే..
మే 17 నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో.. పిసిఎల్ కూడా అదేరోజు పునః ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ లీగ్ లో ఇంకా ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏర్పడిన విపత్కర పరిస్థితి వల్ల లీగ్ ఆగిపోయింది. వాటిని నిర్వహించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. అయితే దానికి ఎమైరేట్స్ క్రికెట్ బోర్డు ఏమాత్రం ఒప్పుకోలేదు. దీంతో లీగ్ వాయిదా పడక తప్పలేదు. అయితే మే 17 నుంచి పిసిఎల్ కూడా రీఓపెన్ అవుతోంది. ఈ మ్యాచ్లు రావల్పిండి వేదికగా జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ లాహోర్లో నిర్వహిస్తారు. పిసిఎల్ మళ్లీ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ.. విదేశీ ప్లేయర్లు వస్తారా? లేదా? అనేది అనుమానంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఫారిన్ ప్లేయర్లు ఆడేందుకు ఇష్టాన్ని చూపించడం లేదు. కొంతమంది విదేశీ ప్లేయర్లు తమ దేశానికి వెళ్తూ విమానాశ్రయంలో ఏడ్చారు. ఆ సంఘటనలో మీడియాలో ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. మరి ఇప్పుడు పిసిఎల్ బిగిన్ అవుతున్న నేపథ్యంలో.. ఫారిన్ ప్లేయర్లు ఆడతారా.. లేదా.. అనేది అనుమానం గా ఉంది. అయితే ఫారిన్ ప్లేయర్లు ఆడకపోతే మాత్రం పిసిఎల్ అభాసుపాలయ్యే అవకాశం లేకపోలేదు. ” సెక్యూరిటీ కల్పించే విషయంలో పాకిస్తాన్ ఎప్పటికీ గట్టి చొరవ తీసుకోదు.. గతంలో అనేక సంఘటనలు దీనిని నిరూపించాయి. ఇప్పుడు పిసిఎల్ విషయంలోనూ పాకిస్తాన్ ఆస్థాయిలో సెక్యూరిటీ ఇస్తుందనే నమ్మకం లేదు. అందువల్లే ఫారిన్ ప్లేయర్లు ఈసారి ఆడేందుకు రాకపోవచ్చని” అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.