IPL 2025 : ఐపీఎల్ అంటే ఎవరికైనా పరుగుల వరద గుర్తుకొస్తుంది. ఆటగాళ్లు ముఖ్యంగా బ్యాటర్లు బౌలర్ల పై ఏమాత్రం కనికరం చూపించకుండా బాదుతూ ఉంటారు. ఇదే సమయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఉంటారు. అయితే ఈసారి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా రికార్డులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో సాధ్యం కానీ ఘనతలు ఈసారి చోటుచేసుకున్నాయి. అయితే గ్రూప్ దశ వరకే ఇలా ఉంటే. తదుపరి జరిగే ప్లే ఆఫ్, సెమీఫైనల్, ఫైనల్ లో ఎలాంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయోనని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
Also Read : విరాట్ కోహ్లీ సలహా తో క్లాసెన్‌ను ఔట్ చేసిన సుయాష్ శర్మ
ఇక ఈ సీజన్లో బ్యాటర్లు గతానికంటే ఎక్కువ రెచ్చిపోతున్నారు. భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నారు. ఇప్పటికే 9 మంది ప్లేయర్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇక ఈ జాబితాలో తొలి మూడు స్థానాలలో విరాట్ కోహ్లీ, సాయి సుదర్శన్, సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. వాస్తవానికి ఐపీఎల్ చరిత్రలో 9 మంది ప్లేయర్లు ఒక్కొక్కరు 500 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. వారంతా కూడా బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మైదానం ఎలాంటిదైనా సరే లెక్కపెట్టడం లేదు. పరుగులు రాబట్టడమే పనిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇక ఆయా జట్లలో బౌలర్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు.. కొన్ని సందర్భాల్లో గొప్ప గొప్ప బ్యాటర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నారు.
ఇక ఈసారి ఐపీఎల్ లో నమోదైన అనితర సాధ్యమైన ఘనత ఏదంటే.. 42 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులను ఆయా జట్లు చేశాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 42 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులను ఆయా జట్లు చేశాయి. ఇక 2024లో 41 సార్లు జట్లు 200+ పరుగులు చేశాయి. 2023లో 37 సార్లు 200+ పరుగులు చేశాయి. 2022లో 18సార్లు 200+ పరుగులు చేశాయి. 2018లో 15 సార్లు 200+ పరుగులు చేశాయి. అయితే 2018 తర్వాత 2021లో మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆటగాళ్లు పరుగులు చేయలేకపోయారు. ఒక రకంగా ఐపీఎల్ చరిత్రలో 2019 సీజన్ ను బౌలర్ల ప్యారడైజ్ గా అభివర్ణించవచ్చు..” అయితే ఇప్పటికే 42 సార్లు ఈ సీజన్లో ఆయా జట్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేశాయి. ఇంకా ప్లే ఆఫ్, ఇతర మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. చూడబోతే అంతకుమించి అనే స్థాయిలో పరుగులు నమోదయ్యే అవకాశం కల్పిస్తోంది. మొత్తంగా ఈసారి ఐపీఎల్లో సరికొత్త బెంచ్ మార్కులు సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోందని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.