IPL 2025 RCBvPBKS Final : టాస్ గెలిచిన తర్వాత పంజాబ్ కెప్టెన్ మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. గొప్ప గొప్ప లేకపోయినప్పటికీ ప్లాట్ మైదానంపై బౌలర్లను మార్చి మార్చి బెంగళూరు జట్టు మీదికి ప్రయోగిస్తున్నాడు. ద్వారా బెంగళూరు ఈ కథనం రాసే సమయం వరకు నాలుగు వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు పూర్తయ్యాయి. నాలుగు వికెట్లు కోల్పోయి కన్నడ జట్టు 132 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు తరపున విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు. 35 బంతుల్లో మూడు ఫోర్ల సహాయంతో 43 పరుగులు చేసిన అతడు.. ఓ మరి జాయ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో ఒక్కసారిగా బెంగళూరు అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నుంచి పరుగుల వరద వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్లాట్ మైదానంపై అతడు సింగిల్స్, డబుల్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కానీ ఓమర్ జాయ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఓమర్ జాయ్ స్లో బౌన్సర్ వేసి విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించాడు.
Also Read : ఇరుగు దిష్టి.. పంజాబ్ దిష్టి.. అంతా ఈ నిమ్మకాయలతో, మిరపకాయలతో పోవాలి.. థూ: వైరల్ వీడియో
కెప్టెన్ తో సహా ముఖ్యమైన ప్లేయర్లు అవుట్ అయినప్పటికీ.. పరుగుల మాంత్రికుడు ఉన్నాడని ధైర్యంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాహల్ వేసిన ఓవర్లో 13 పరుగులు చేసిన నేపథ్యంలో.. వెంటనే కెప్టెన్ అయ్యర్ ఓమర్ జాయ్ కి బంతి అందించాడు. దీంతో అతడు స్లో బౌన్సర్లు వేస్తూ కన్నడ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ ముందుకొచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి బ్యాట్ చివరి అంచుతాకి గాల్లో లేచింది. దీంతో బౌలర్ ఓమర్ జాయ్ అమాంతం పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. గాల్లోకి తన శరీరాన్ని వంచి అమాంతం క్యాచ్ అందుకొని.. అయ్యర్ జట్టుకు తిరుగులేని ఆనందాన్ని అందించాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీకి తీవ్ర నిరాశ మిగిల్చాడు. పరుగుల మాంత్రికుడు అవుట్ కావడంతో కన్నడ అభిమానులు ఒక్కసారిగా దిగ్బ్రాంతి చెందారు. విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో కన్నడ జట్టు భారీ స్కోరు చేస్తుందని అంచనాలు తలకిందులయ్యాయి. లివింగ్ స్టోన్, జితేష్ శర్మ మీద కన్నడ జట్టు ఆశలు పెంచుకుంది. మరి వీరిద్దరూ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. పట్టలేని బాధతో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. విరాట్ కోహ్లీని చూసి అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Final. WICKET! 14.5: Virat Kohli 43(35) ct & b Azmatullah Omarzai, Royal Challengers Bengaluru 131/4 https://t.co/U5zvVhbXnQ #Final #RCBvPBKS #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) June 3, 2025