RCBvPBKS Final ప్రత్యర్థి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ కు ఆహ్వానించడంతో.. బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. ప్లాట్ పిచ్ పై 190 పరుగులు చేసింది. ఒక రకంగా ఈ మైదానంపై ఇది చేదించే గలిగే లక్ష్యమే. పైగా క్రితం మ్యాచ్లో ముంబై విధించిన 200+ టార్గెట్ ను అయ్యర్ జట్టు ఫినిష్ చేసింది. మరీ ముఖ్యంగా అయ్యర్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. దీనికి తోడు ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, జోస్ ఇంగ్లిస్, శ్రేయస్ అయ్యర్, లివింగ్ స్టోన్, నెహల్ వదెరా, శశాంక్ సింగ్ వంటి వారు ఉండడంతో.. ఈ లక్ష్యాన్ని చేదించడం సులువు అని అందరూ అనుకున్నారు. పంజాబ్ ఓపెనర్లు కూడా ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఏమాత్రం భయం లేకుండా పరుగులు తీశారు. దీంతో పంజాబ్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు.

ఎప్పుడైతే బెంగళూరు కెప్టెన్ పాటిదార్ హేజిల్ వుడ్ ను రంగంలోకి దింపాడో.. అప్పుడే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్య(24) ను అవుట్ చేశాడు. సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అతడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (26), ఇంగ్లిస్(39) ను అవుట్ చేయడంతో ఒక్కసారిగా పంజాబ్ ఒత్తిడిలో పడిపోయింది. ఈ దశలో వచ్చిన కెప్టెన్ అయ్యర్ (1) పరుగు మాత్రమే చేసి షెఫర్డ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో ఒకసారిగా మ్యాచ్ బెంగళూరు వైపు మళ్ళి పోయింది. నేహళ్ వదేరా 15 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ కావడంతో.. ఇక మ్యాచ్ బెంగళూరుదే అని తేలిపోయింది. చివర్లో శశాంక్ సింగ్ హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నప్పటికీ.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాడు. మొత్తంగా బెంగళూరు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి.. ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
The tears say it all
An 1️⃣8️⃣-year wait comes to an end
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @imVkohli pic.twitter.com/X15Xdmxb0k
— IndianPremierLeague (@IPL) June 3, 2025