Rana Naidu 2 Trailer : విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్ వచ్చి ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో మనందరికి తెలిసిందే…ఈ సిరీస్ కి ఇప్పుడు సెకండ్ సీజన్ వస్తుంది అంటూ మేకర్స్ అప్పుడే అనౌన్స్ చేశారు. అయితే ఈ సిరీస్ అభిమానులు మాత్రం సెకండ్ సీజన్ ఎప్పుడు వస్తుంది అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తి ఎదురు చూస్తున్న క్రమంలో నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక దాంతో పాటుగా జూన్ 13వ తేదీన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందంటూ అనౌన్స్ చేయడం విశేషం… ఇక ఇప్పటివరకు రానా నాయుడు మొదటి సీజన్ లో వెంకటేష్ బోల్డ్ డైలాగ్ లు చెబుతూ బోల్డ్ కంటెంట్ లో నటించాడు. నిజానికి వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఇష్టపడతారు. అతను చేసే ప్రతి సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. కానీ దానికి పూర్తి డిఫరెంట్ గా ఈ సిరీస్ ను తీశారు. ఆడవాళ్లు, చిన్నపిల్లలు అసలు ఈ సిరీస్ ని చూడలేని విధంగా ఉంటుంది. మరి అలాంటి సిరీస్ ఎందుకు చేశారు అని వెంకటేష్ ను అడిగితే ఆర్టిస్ట్ అంటే అన్ని రకాల పాత్రను పోషించాలి అందుకే ఈ సిరీస్ ని చేశానని ఆయన చెప్పడం విశేషం… ఇక ఇప్పుడు సీజన్ 2 కి సంబంధించిన ట్రైలర్ ను మనం గమనిస్తే ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ని కొంతవరకు చూపించి బోల్డ్ కంటెంట్ కొంత తగ్గించినట్టుగా తెలుస్తోంది.
మొత్తానికి ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే రానా, వెంకటేష్ ఇందులో మరోసారి పవర్ఫుల్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మొదటి పార్ట్ కంటే ఈ పార్ట్ లో కొంతవరకు అడల్ట్ కంటెంట్ ని తగ్గించి చూపించే విధంగా ఈ సిరీస్ ని మలిచినట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి సీజన్ కి విమర్శలు రావడం వల్లే దీనికోసం మంచి కథను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇటు యాక్షన్ ని, అటు కామెడీని బాలన్స్ చేస్తూ ఈ సినిమా సిరీస్ ని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక రానా మాత్రం ఇందులో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఇక ఇందులో కృతి కర్బందా, అర్జున్ రాంపాల్, సుశాంత్ సింగ్ లాంటి నటీనటులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు.
ట్రైలర్ లో ఉన్న యాక్షన్ పార్ట్స్ సిరీస్లో ఎక్కువగా సంఖ్యలో ఉన్నట్లయితే సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది… మొదటి సీజన్ కు మించి ఇందులో స్టోరీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటి పార్ట్ లో ఎక్కువగా బూతుల మీద డిపెండ్ అయిన మేకర్ ఈ సిరీస్ లో మాత్రం కథని ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు సాగినట్టుగా తెలుస్తోంది.
