Khadgam Heroine
Khadgam Heroine: బాలీవుడ్ లో జరిగే ప్రతి సినిమా ఈవెంట్స్ లో అలాగే ప్రైవేట్ పార్టీలలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటాడు. బుల్లితెర మీద పలు టీవీ షోలలో కూడా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. బాలీవుడ్ సినీ తారలతో చిత్ర విచిత్రమైన ఫోజులతో ఫోటోలు దిగి ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ బాగా ఫేమస్ అయ్యాడు ఓరి. ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఒకప్పుడు టాలీవుడ్ లో తోపు హీరోయిన్. ఒక్క సినిమాతోనే బాగా ఫేమస్ అయ్యి స్టార్ స్టేటస్ కూడా సంపాదించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఒకప్పుడు ఈ అమ్మడు పెద్ద స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. కానీ ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీ ఓరి వద్ద మేనేజర్ గా పనిచేస్తుంది. ఇక ఓరి అలియాస్ వర్హాన్ గురించి అందరికీ తెలిసిందే. ఇతను బాలీవుడ్ సినిమా ఈవెంట్లలో అలాగే పార్టీలలో కనిపించి సినీ సెలబ్రిటీలతో వెరైటీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి బాగా ఫేమస్ అయ్యాడు. నెట్టింటా ఇతను బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ ఇప్పుడు ఓరి దగ్గర మేనేజర్ గా పనిచేస్తుంది. ఈమె షారుక్ ఖాన్ మరియు అమితాబ్ బచ్చన్ లతో బ్లాక్ బస్టర్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె మరి ఎవరో కాదు కిమ్ శర్మ. మోహబతే సినిమాతో కిమ్ శర్మ బాగా ఫేమస్ అయ్యింది. ఈమె ఓరి విజయం వెనుక ఉన్న వ్యక్తి. టాలీవుడ్ లో కిమ్ శర్మ ఖడ్గం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాతో ఆమె మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఓరి మేనేజర్ గా పని చేస్తూ కిమ్ శర్మ 10 కోట్లకు పైగానే ఆస్తులను సంపాదించినట్లు తెలుస్తుంది. ఇటీవల కిమ్ శర్మ కృనాల్ సదానంద తో పాడ్ కాస్ట్ లో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఓరి లైఫ్ స్టైల్ గురించి కూడా ఈమె మాట్లాడింది. కిమ్ శర్మ మోడలింగ్ రంగంలో తన కెరియర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత 2000లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన మొహబ్బతే సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే హిందీలో పలు సినిమాలలో నటించి బాగా ఫేమస్ అయ్యింది. తెలుగులో శ్రీకాంత్ హీరోగా నటించిన ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ కు ప్రేయసిగా కనిపించింది. సినిమాలకు దూరం అయిన కిమ్ శర్మ కొంతకాలం కెన్యాకు వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఈమె వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం కిమ్ శర్మ ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీస్ కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తుందని సమాచారం.