https://oktelugu.com/

IPL 2025: కోల్ కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగేది అనుమానమే..

IPL 2025 ఐపీఎల్ 18 వ ఎడిషన్ ప్రారంభానికి ముందే క్రికెట్ అభిమానులకు చేదువార్త. 18 ఎడిషన్లో ప్రారంభ మ్యాచ్ లో కోల్ కతా, నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

Written By: , Updated On : March 22, 2025 / 09:55 AM IST
IPL 2025 (7)

IPL 2025 (7)

Follow us on

IPL 2025: ప్రారంభ మ్యాచ్ కు ముందు ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఐపీఎల్ నిర్వాహక కమిటీ భారీగా ఏర్పాట్లు చేసింది. బాలీవుడ్ నటి దిశాపటాని, సింగర్ శ్రేయ ఘోషాల్ తో సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు నిర్వహించనుంది. సాయంత్రం 6:30 నుంచే ఈ కార్యక్రమాలు మొదలవుతాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే దిశపటాని, శ్రేయ ఘోషల్ కోల్ కతా చేరుకున్నారు. వీరితోపాటు ఇంకా చాలామంది బాలీవుడ్, ఇతర సినీ ప్రముఖులు కూడా సంగీత కార్యక్రమాలలో పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తానికి అభిమానులకు క్రికెట్ వినోదంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాల మజాను కూడా ఐపీఎల్ నిర్వహణ కమిటీ అందించనుంది.. ఇప్పటికే టికెట్లను బుక్ మై షో ద్వారా విక్రయించారు. టికెట్లు మొత్తం ఎప్పుడో అమ్ముడుపోయాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం 68 వేలు కాగా, అన్ని టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

Also Read: యజువేంద్ర చాహల్ – ధనశ్రీ.. ఇక అధికారికం

సాధ్యమవుతుందా..

కోల్ కతా లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత రెండు రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోయాయి. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 27, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. పైగా అక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని ఆరంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇదే కనుక జరిగితే తొలి మ్యాచ్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురైనట్టే. ప్రారంభ వేడుకలు కూడా జరిగేది అనుమానమే. శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్ ను కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు సంతృప్తికరంగానే పూర్తి చేసుకున్నప్పటికీ.. శనివారం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఒక్కసారిగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ వర్షం కురిస్తే మ్యాచ్ నిర్వహణకు ఒక గంట పాటు అదనంగా సమయం కేటాయిస్తారు. అప్పటికి వర్షం ఇబ్బంది పడితే 5 ఓవర్ల పాటు మ్యాచ్ నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచును అర్ధరాత్రి 12 గంటల లోపు ముగిస్తారు. ఇక వర్షం ఎడతెరిపి లేకుండా కురిస్తే మాత్రం రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు.. అయితే ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో.. కనీసం 5 ఓవర్ల పాటు మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది.. ” వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు తగుముఖం పట్టాయి. రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పుల దృష్ట్యా ఆరంజ్ అలర్ట్ జారీ చేశాం. వేసవికాలంలో ఈ ప్రాంతంలో వర్షాలు కురవడం కామనే. మేఘాల కదలికలు కూడా చురుకుగా ఉన్నాయి. వర్షం సాధారణ నుంచి ఒక మోస్తరుగా పడే అవకాశం ఉందని” వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

 

Also Read: మండే ఎండల్లో.. మస్తు క్రికెట్ మజా..