https://oktelugu.com/

Spirit : స్పిరిట్ సినిమాలో ప్రభాస్ అన్న గా నటిస్తున్న స్టార్ హీరో…

Spirit : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

Written By: , Updated On : March 22, 2025 / 09:39 AM IST
Spirit

Spirit

Follow us on

Spirit : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సందీప్ రెడ్డివంగ (సందీప్ దీక్షిత్ Reddy Vanga) ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ (Animal) సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఆయనకు ఇండియా వైడ్ మంచి పాపులారిటి అయితే వచ్చింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయనటువంటి బోల్డ్ సినిమాలను చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నట్టుగా తెపుస్తోంది. అయితే ఈ సినిమాతో పాన్ ఇండియాలో ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఇక వీళ్లిద్దరూ కలిసి ఇండస్ట్రీ రికార్డు లను బ్రేక్ చేయాలని చూస్తున్నారు. తద్వారా 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత సందీప్ తో చేయబోయే స్పిరిట్ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించినట్లయితే సందీప్ వంగ స్టార్ డైరెక్టర్ గా మరోసారి తన సత్తాను చాటుకుంటాడు. అలాగే ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్న వాడవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ అన్న గా సంజయ్ దత్ (Sanjay Dath) ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.

Also Read : స్పిరిట్ కోసం ప్రభాస్ బాడీ మీద ఆ టాటు వేయిస్తున్న సందీప్ రెడ్డి వంగ…

ఇక సందీప్ రెడ్డి వంగతో సినిమాలు అంటే కొంతమంది హీరోలు భయపడుతున్నప్పటికి మరి కొంతమంది హీరోలు మాత్రం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అనిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఆయన స్పిరిట్ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నాడు.

ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి పెద్దహిట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ఇక తెలుగు హీరోలు మాత్రం అతనితో సినిమాలు చేయడానికి అడ్వాన్స్ గా అతన్ని బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన ప్రభాస్ సినిమా తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలతో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు.

మరి వాళ్ళతో సినిమాలను చేసి తన ఐడెంటిటి ని కాపాడుకొని స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పుడు రాబోయే సినిమాలతో వరుస విజయాలను అందుకుంటే సందీప్ రెడ్డి వంగ రాజమౌళి రేంజ్ ను అందుకున్న దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.

Also Read : స్పిరిట్ సినిమాలో ఒక స్పెషల్ పాత్ర చేయడానికి ఆ స్టార్ హీరో ఫిక్సయ్యాడా..?