IPL 2025: ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతోంది. పహల్గాం దాడి తర్వాత ఐపీఎల్ నిర్వహణకు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. చివరికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఐపీఎల్ నిర్వహణ మొదలైంది. ఇన్ని రోజులపాటు ఐపీఎల్ వాయిదా పడటంతో నిర్వాహకులకు కాస్త ఆర్థికంగా ఇబ్బంది కలిగింది.. ఇక దానిని పూడ్చుకోవడానికి రకరకాల మార్గాలలో నిర్వాహకులు ప్రయాణాలు చేస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్ ను అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేలా చేస్తున్నారు. తద్వారా యాడ్ రెవెన్యూను భారీగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక నిన్నటి లక్నో – హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు దిగేష్ రాటి, అభిషేక్ శర్మ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రచారం లభించింది. దీంతో నిన్నటి నుంచి ఈ గొడవనే మీడియాలో ప్రధాన వార్తగా ప్రసారమవుతోంది. ఇక సోషల్ మీడియా లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి దిగ్వేష్ ప్రవర్తన ఈ సీజన్ ప్రారంభం నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది. అతడు చేస్తున్న ఓవరాక్షన్ మిగతా ప్లేయర్లకు చికాకును కలిగిస్తోంది.
Also Read: జుట్టుపట్టుకొని కొడతారేయ్.. దిగ్వేష్ కు అభిషేక్ వార్నింగ్.. వైరల్ వీడియో
గత మూడు సీజన్లుగా ఐపీఎల్లో ఓవరాక్షన్ స్టార్లు మైదానంలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు.. 2023 సీజన్లో రియాన్ పరాగ్ ఎక్కువ చేసేవాడు. ఫోర్ కొట్టినా.. సిక్సర్ బాదినా తన చేష్టలతో ఆతి చేసేవాడు. దీంతో అతడు మ్యాచ్లలో ఫీజు కోతకు గురయ్యాడు. చివరికి ఆ సీజన్ తర్వాత తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకున్నాడు..
ఇక 2024 సీజన్లో హర్షిత్ రానా చాలా ఎక్కువ చేసేవాడు.. వికెట్లు పడగొట్టినప్పుడు తన అతి ప్రవర్తనతో తోటి ఆటగాళ్లకు ఇబ్బంది కలిగించేవాడు. దీంతో అతడికి రెండు మూడుసార్లు హెచ్చరికలు జారీచేసిన ఐపీఎల్ నిర్వహణ కమిటీ.. ఆ తర్వాత మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో దెబ్బకు హర్షిత్ దారిలోకి వచ్చాడు. ఆ తర్వాత తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పుడు మొత్తంగా తన ఆట ఏదో ఆడుకుంటూ వెళ్తున్నాడు. అంతే తప్పించి గతంలో మాదిరిగా పిచ్చిపిచ్చి వ్యవహారాలు చేయడం లేదు.
ఇక ఇప్పటి సీజన్లో దిగ్వేశ్ మామూలు అతి చేయడం లేదు. వికెట్ తీస్తే చాలు సంతకాలు చేస్తూ రెచ్చగొడుతున్నాడు. ఇక ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఆటగాడి వికెట్ తీసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అతడు చేస్తున్న అతి మామూలుగా లేదు.. ఒత్తయిన జుట్టుతో.. కనిపిస్తున్న అతడు.. సంతకం చేస్తూ తోటి ఆటగాళ్లను గేలి చేస్తున్నాడు . ఇక హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మను ఇదేవిధంగా గేలి చేయడంతో.. అతడు కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యాడు. దీంతో మైదానంలో గొడవ జరిగింది. చివరికి సద్దు మణిగింది. అయితే ఈ వ్యవహారాన్ని ఐపిఎల్ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వెంటనే దిగ్వేష్ కు మ్యాచ్ ఫీజులో 50% కోత విధించింది. మరోవైపు అభిషేక్ శర్మకు కూడా 25% కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రతి సీజన్లో ఇలా ఓవరాక్షన్ స్టార్లు రావడంతో ఆటకంటే వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడుతోంది. మైదానంలో క్రమశిక్షణతో ఉంటూ.. జెంటిల్ మాన్ గేమ్ ఆడాల్సిన ప్లేయర్లు ఇలా చౌకబారు ఓవరాక్షన్ చేసి పరువు తీసుకుంటున్నారు. చివరికి గల్లి స్థాయి ప్లేయర్ల కంటే తీసిపోతున్నారు. ఇలాంటి వారి వల్ల ఆటకు అదనపు గ్లామర్ ఏమో గాని.. ఉన్న వ్యాల్యూ మొత్తం పోతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.