Sunrisers Hyderabad
Sunrisers Hyderabad: మార్చి 22 వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని టీములు కూడా ట్రోఫీని కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అయితే ఈసారి భారీ కసరత్తులతో ట్రోఫీ ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసమే 20.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పాట్ కమ్మిన్స్ ను కెప్టెన్ గా కూడా నియమించింది. ఇక అతను సారధ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈసారి బరిలోకి దిగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే టీమ్ యాజమాన్యం అఫీషియల్ గా ఫ్యాట్ కమ్మిన్స్ ను కెప్టెన్ గా అనౌన్స్ చేసింది. దాంతో ఇంతకు ముందు కెప్టెన్ గా ఉన్న మార్కరం ప్లేయర్ గా మాత్రమే కొనసాగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సన్ రైజర్స్ టీం 2016 వ సంవత్సరంలో డేవిడ్ వార్నర్ నేతృత్వంలో ఒకసారి టైటిల్ అయితే దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ ని కూడా దక్కించుకోకపోవడం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆట తీరు ఎలా ఉందో అందరికీ తెలియజేస్తుంది. అప్పటినుంచి ఆడిన ప్రతి సీజన్ లో హైదరాబాద్ టీమ్ దారుణం గా ఫెయిల్ అవుతూనే వస్తుంది. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతోనే మొదటి నుంచే భారీ కసరత్తులను చేస్తూ బరిలోకి దిగుతున్నారు.
ఇప్పటికే ఈ టీం బ్యాటింగ్ బాధ్యతల్ని ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, మర్క్రరం లాంటి ప్లేయర్లు మోయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పేస్ బౌలింగ్ భారం మొత్తాన్ని పాట్ కమ్మిన్స్ చూసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కమ్మిన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ టీం బౌలర్లు బరిలోకి దిగబోతున్నారు నటరాజన్, మర్కో యాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ లు చెలారెగిపోతారు…ఇక హైదరాబాద్ టీం లో బ్యాటింగ్ కంటే బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాబట్టి బౌలర్లు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్స్ ను భయపెట్టి బెంబేలెత్తించడం పక్కా అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ యాజమాన్యం భావిస్తుంది…
ఇక సన్ రైజర్స్ టీమ్ లో ప్లేయింగ్ 11 ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెస్, అబ్దుల్ సమద్, వాషింగ్ టన్ సుందర్/ షబాజ్ అహ్మద్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), వనిందు హసరంగా, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మర్ఖండే లాంటి ప్లేయర్లతో బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇంపాక్ట్ ప్లేయర్లు గా
నటరాజన్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, మార్కరం బరిలోకి దిగనున్నారు…