https://oktelugu.com/

IPL 2024: సన్రైజర్స్ కు కొత్త క్యాప్టెన్.. ఎవరంటే?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ - 2024 మరో 16 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి టోర్నీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని జట్లు తమ కోచింగ్‌ బృందంలోని సభ్యులను మారుస్తుండగా, తాజాగా సన్‌రైజర్స్‌ జట్టు కెప్టెన్‌ను మార్చింది.

Written By: , Updated On : March 5, 2024 / 08:16 AM IST
IPL 2024

IPL 2024

Follow us on

IPL 2024: ఊహించిందే జరిగింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ మార్పుపై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు టీం మేనేజ్‌మెంట్‌ తెరదించింది. జట్టు కొత్త సారథిగా వన్డే వరల్డ్‌ కప్‌ – 2023 విన్నింగ్‌ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను నియమించింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.

16 రోజుల్లో ఐపీఎల్‌ – 2024
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ – 2024 మరో 16 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి టోర్నీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని జట్లు తమ కోచింగ్‌ బృందంలోని సభ్యులను మారుస్తుండగా, తాజాగా సన్‌రైజర్స్‌ జట్టు కెప్టెన్‌ను మార్చింది. మార్‌క్రమ్‌ను కెప్టెన్సీ నుంచి తపి‍్పంచింది. గత సీజన్‌లో మార్‌క్రమ్‌ ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. గత సీజన్‌లో ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ సారథ్యంలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ పేదలవ ప్రదర్శన కనబర్చింది. 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో కొన్ని రోజులుగా కెప్టెన్‌ మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు కోచ్‌గా డానియల్‌ వెటోరీని నియమించింది. సారథిగా ప్యాట్‌ కమిన్స్‌ను నియమించింది.

రూ.20.50 కోట్లతో కొనుగోలు..
ఇక ప్యాట్‌ కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం రూ.20.50 కోట్లు వెచ్చించింది. అతడి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సారథ‍్య బాధ్యతలను కూడా అతనికే అప్పగించింది. ఇక ఐపీఎల్‌ మార్చి 22 నుంచి 2024 సీజన్‌ ప్రారంభం కానుంది. మార్చి 23న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌ ఆడుతుంది.