https://oktelugu.com/

Hyundai Vs Tata Motors : హ్యుుందాయ్ ని వెనక్కి నెట్టిన టాటా మోటార్స్.. ఫిబ్రవరిలో అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

మొన్నటి వరకు హ్యుందాయ్ కంపెనీ మారుతి తరువాత అత్యధిక సేల్స్ తో రెండో స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు కంపెనిని టాటా మోటార్స్ భర్తీ చేసింది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 5, 2024 / 08:25 AM IST

    Hyundai Vs Tata motores

    Follow us on

    Hyundai Vs Tata Motors :కార్ల వినియోగదారుల అభిరుచులు రోజురోజుకు మారుతున్నాయి. దీంతో వారు కొత్త తరం కార్లు కావాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్నికంపెనీలు కన్జూమర్స్ ను ఆకర్షించడానికి కొత్త ఫీచర్స్ తో పాటు ఆకట్టుకునే డిజైన్ తో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తారు. ఇలా పోటీ పడి కార్లను ఉత్పత్తి చేయడంతో కొన్ని కార్లు వాటి స్థానాలు మారుతున్నాయి.  హ్యుందాయ్ కంపెనీ మారుతి తరువాత అత్యధిక సేల్స్ తో రెండో స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు కంపెనిని టాటా మోటార్స్ భర్తీ చేసింది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లో అత్యధికంగా విక్రయాలు సాగించి హ్యాందాయ్ ని వెనక్కి నెట్టేసింది.

    దేశీయ కార్ల వినియోగదారులు ఇండియా కార్ల వైపు ఎక్కువగా చూస్తున్నారు. దేశంలో అగ్రస్థానంలో నిలిచే కార్ల కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్ గత రెండు నెలలుగా అమ్మకాల్లో దూసుకుపోతుంది. 2024 ఫిబ్రవరి నెలలో 51, 321 యూనిట్లను విక్రయించింది. అయితే హ్యుందాయ్ కంపెనీ మాత్రం 50, 201 కార్ల అమ్మకాలు జరిపింది. 2023 ఫిబ్రవరిలో టాటా మోటార్స్ 79,705 యూనిట్లను సేల్స్ చేసింది. ఆ ఏడాది హ్యుందాయ్57,851 విక్రయాలు జరుపుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు తగ్గినప్పటికీ హ్యుందాయ్ కంటె టాటా మోటార్స్ పై చేయి సాధించింది.

    2024 ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాల్లో 8.4 శాతం వృద్ధి నమోదైంది. ఎగుమతుల పరంగా 86,406 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 79,705 అమ్మకాలు జరిపింది. హ్యుందాయ్ 2024 ఫిబ్రవరిలో 10,300 యూనిట్ల విక్రయాలు జరిపింది. గతే ఏడాదితో పోలిస్తే 5.8 శాతం క్షీణతను నమోదు చేసింది. అంటే హ్యుందాయ్ ఎగుమతుల పరంగానూ నష్టాలను చవి చూస్తోంది. ఈ తరుణంలో మూడు నెలల్లో టాటా మోటార్స్ తో పోటీ పడి హ్యుందాయ్ తన 2వ స్థానాన్ని కోల్పోయింది.

    ఎలక్ట్రిక్ విభాగంలోనూ టాటా మోటార్స్ హవా సాగిస్తోంది. ఫిబ్రవరి నెలలో టాటా మోటార్స్ 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో ఈ కంపెనీ 6,923 వాహనాలను అమ్మింది. గత ఏడాది ఇదే నెలలో 5,318 యూనిట్లను విక్రయించింది. మొత్తంటా టాటా మోటార్స్ తమ యూనిట్ల విక్రయాలను పెంచుకుంటూ పోతుంది.