IPL 2024 SRH Vs MI: ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠ గా సాగుతోంది.. కీలక దశకు చేరుకోకుండానే అభిమానులకు అసలు సిసలైన టి20 మజా అందిస్తోంది. లీగ్ మ్యాచ్ దశలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాదులోని ఉప్పల్ మైదానం వేదికగా బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ జట్టుపై 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యుత్తమ స్కోరు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు హెడ్ (62), అభిషేక్ శర్మ (63), క్లాసెన్(80 నాటౌట్) మార్క్రమ్(42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. హైదరాబాద్ ఆటగాళ్ల దూకుడుకు ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. 2013లో బెంగళూరు జట్టు నమోదు చేసిన 263/5 ఇప్పటివరకు హైయెస్ట్ స్కోర్ గా ఉండేది. కానీ దానిని ఆరెంజ్ ఆర్మీ అధిగమించింది. హైదరాబాద్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే..
2013 ఐపిఎల్ సీజన్లో బెంగళూరు జట్టు పూణే వారియర్స్ పై ఐదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. నిన్నటి వరకు ఇది హైయెస్ట్ రికార్డ్ గా ఉండేది.
2023లో లక్నో జట్టు మొహాలీ వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.
2016లో గుజరాత్ లయన్స్ జట్టుపై బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.
2010 ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు రాజస్థాన్ రాయల్స్ పై ఐదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.
అత్యధిక పరుగులు మాత్రమే కాదు.. అత్యధిక సిక్సర్లు కూడా హైదరాబాద్, ముంబై మ్యాచ్లో నమోదయ్యాయి. హైదరాబాద్, ముంబై ఆటగాళ్లు ఈ మ్యాచ్లో ఏకంగా 38 సిక్సర్లు కొట్టారు.
2018లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు, చెన్నై జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఏకంగా 33 సిక్సర్లు నమోదయ్యాయి.
షార్జా వేదికగా 2020లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్, చెన్నై జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లు 33 సిక్సర్లు కొట్టారు.
గత ఏడాది సీజన్లో బెంగళూరు వేదికగా బెంగళూరు, చెన్నై జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇరుజట్ల ఆటగాళ్లు 33 సిక్సర్లు కొట్టారు.
2013లో జరిగిన ఐపీఎల్ సీజన్లో పూణే వారియర్స్ జట్టుపై బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు 21 సిక్సర్లు కొట్టారు.
2016 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు 20 సిక్సర్లు బాదారు.
2017 ఐపిఎల్ సీజన్లో గుజరాత్ జట్టు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఆటగాళ్లు ఏకంగా 20 సిక్సర్లు కొట్టారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఆటగాళ్లు 20 సిక్సర్లు కొట్టారు.
2015 ఐపీఎల్ సీజన్లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టుతో తలపడిన బెంగళూరు జట్టు ఆటగాళ్లు 18 సిక్సర్లు కొట్టారు.
2020 ఐపిఎల్ సీజన్లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు పై రాజస్థాన్ జట్టు ఆటగాళ్లు 18 సిక్సర్లు బాదారు.
గత ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో కోల్ కతా లో జరిగిన మ్యాచ్లో కోల్ కతా జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు 18 సిక్సర్లు కొట్టారు.
ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు ఏకంగా 18 సిక్సర్లు బాదారు.