IPL 2024 SRH vs MI : మిగతా ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా.. కెప్టెన్ కు పిచ్ పై కచ్చితంగా అవగాహన ఉండాలి. ఎందుకంటే మ్యాచ్ గెలుపు ఓటముల్లో 50 శాతం మైదానం నిర్ణయిస్తుంది. అలాంటప్పుడు టాస్ నిర్ణయం కీలకమవుతుంది. టాస్ గెలిచిన క్రమంలో మైదానం మీద ఉన్న అవగాహన ప్రకారం బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకోవడం కెప్టెన్ కు అనివార్యమవుతుంది. మైదానం మీద తేమ ఉంటే బౌలింగ్.. నిర్జీవంగా ఉంటే బ్యాటింగ్ ఎంచుకుంటారు. ఇది ప్రాథమిక సూత్రం. కానీ దీనినే ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా విస్మరించాడు. ఏదో అడ్డి మారి గుడ్డి దెబ్బలా కెప్టెన్ అయిన అతడు.. బుధవారం నాటి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి నిర్జీవంగా ఉన్న మైదానాన్ని చూసి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడే అతడి అవివేకం బయటపడింది.
బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు ఆకాశమేహద్దుగా చెలరేగిపోయింది. బుమ్రా మినహా మిగతా బౌలర్లలందర్నీ ఆ జట్టు ఆటగాళ్లు ఒక ఆట ఆడుకున్నారు. మయాంక్ అగర్వాల్ మినహా మిగతా ఆటగాళ్లు మొత్తం దూకుడుగా బ్యాటింగ్ చేశారు. క్లాసెన్( 80) హెడ్(62), అభిషేక్ శర్మ (62), మార్క్రమ్(42) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మూలానీ రెండు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి అత్యంత చెత్త రికార్డు తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటింగ్ తర్వాత ఆ స్థాయిలో చర్చకు దారి తీసింది రోహిత్, హార్దిక్ వ్యవహారం. గుజరాత్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ అనే గౌరవం లేకుండా హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కు పంపించాడు. ముందుగా నన్నేనా అంటూ సంకేతాలు ఇచ్చిన రోహిత్.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని కూల్ గా బౌండరీ లైన్ వద్దకు వెళ్లి ఫీల్డింగ్ చేశాడు. అప్పుడు ఒకవేళ రోహిత్ శర్మకు మండి హార్దిక్ పాండ్యాకు ఎదురు తిరిగితే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ అది రోహిత్ శర్మకు ఇష్టం లేదు. అక్కడ అతడు హార్దిక్ పాండ్యాకు కాకుండా కెప్టెన్ నిర్ణయానికి గౌరవం ఇచ్చాడు.
ఇక బుధవారం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హార్దిక్.. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. హైదరాబాద్ ఆటగాళ్లు సొంతమైదానంలో బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడారు. అసలు సిసలైన టి20 మజాను ప్రేక్షకులకు అందించారు. ఏకంగా 277 పరుగులు చేసి ఔరా అనిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగతా వారంతా దారుణంగా బౌలింగ్ చేశారు. అయితే హైదరాబాద్ ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ రంగంలోకి దిగాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్యాకు బదులుగా అతడు ఫీల్డింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాలో రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్దకు పంపించాడు. దీంతో నెటిజన్లు హార్దిక్ పాండ్యాను ఒక ఆట ఆడుకుంటున్నారు. “పిల్ల బచ్చగాడివి. రోహిత్ శర్మ పుణ్యం వల్ల ఐపిఎల్ లో ఎదిగావు. గురువు అనే గౌరవం లేకుండా అవమానించావు. అయినప్పటికీ రోహిత్ సైలెంట్ గానే ఉన్నాడు. గుజరాత్ మ్యాచ్లో బౌండరీ లైన్ వద్దకు రోహిత్ శర్మను పంపించావు. పదేపదే అవమానానికి గురిచేశావు. ఇప్పుడు చూడు అదే రోహిత్ శర్మ చేతిలో కెప్టెన్ అయి ఉండి అతడు చెబితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నావ్. దీన్నే కర్మ ఫలం అంటారు. నువ్వు అనుభవించాల్సిందే” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Rohit Sharma sent hardik pandya on the boundary line
This is peak cinema pic.twitter.com/sMfpJvdN71
— Nisarg Prajapati (@TechyNisarg) March 27, 2024