IPL 2024 SRH vs MI : ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ముంబై జట్టుపై జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. ఐపీఎల్లో 10 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు. 277 పరుగులు చేయడం ద్వారా అత్యంత వేగంగా 200 పరుగులకు మించి స్కోర్ చేసిన రెండవ జట్టుగా హైదరాబాద్ నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 14.1 ఓవర్లలో 200 పరుగులు చేసి.. అతి తక్కువ ఓవర్లలో డబుల్ డిజిట్ స్కోర్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆ జట్టు తర్వాత హైదరాబాద్ బుధవారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో 14.4 ఓవర్లలోనే 200 పరుగులు సాధించి రెండవ స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే ఆ ఘనతను పూర్తి చేశాడు. హెన్రిక్ క్లాసెన్ 23 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. ఒక జట్టులో ఇలా ముగ్గురు బ్యాటర్లు తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేయడం కూడా ఓ ఘనతే. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు తరఫున తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఘనత ట్రావిస్ హెడ్ పేరు మీద ఉండేది. అయితే హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. కేవలం 16 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక పవర్ ప్లే లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా హైదరాబాద్ అవతరించింది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో మొదటి పవర్ ప్లే లో 81 పరుగులు సాధించి.. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక 277 పరుగులు చేయడం ద్వారా.. 17 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా హైదరాబాద్ అవతరించింది.
ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు.. వారిలో చావ్లా 17, ములానీ 16.5, క్వెనా 16.5, కొయెట్జీ 14.2, హార్దిక్ 11.5, బుమ్రా 9 ఎకానమీ నమోదు చేశారంటే వారి బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ జట్టు తరఫున హెన్రీ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లోనే 80 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అయితే ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున మొదటి నుంచి క్లాసెన్ సత్తా చాటుతూనే వస్తున్నాడు. గత సీజన్ లో లీగ్ మ్యాచ్ లలో అతడు 16,(6), 36(16), 17(16), 31(19), 53(27), 36(20), 26(12), 47(29), 64(44), 104(51), 18(13) పరుగులు చేశాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా జట్టు పై 63(29), ముంబై పై 80(34) పరుగులు చేశాడు.
!
An all time IPL record now belongs to the @SunRisers
Scocrecard ▶️ https://t.co/oi6mgyCP5s#TATAIPL | #SRHvMI pic.twitter.com/eRQIYsLP5n
— IndianPremierLeague (@IPL) March 27, 2024