https://oktelugu.com/

IPL 2024: వారం క్రితం గాయం.. నేడు మాయం.. చెన్నై జట్టులోకి స్పెషలిస్ట్ బౌలర్

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ముస్తాఫిజుర్ అనే ఆటగాడు ప్రాక్టీస్ చేస్తుండగా తలకు గాయమై వారం పాటు చికిత్స పొందాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో శ్రీలంక జట్టుతో జరిగిన టి20 సిరీస్ నాటికి అతడు కోలుకున్నాడు. టి 20 లతోపాటు వన్డే సిరీస్ కూడా ఆడాడు.

Written By: , Updated On : March 20, 2024 / 08:07 AM IST
IPL 2024

IPL 2024

Follow us on

IPL 2024: ఆ ఆటగాడు ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం కోలుకున్నాడు. ఎంత ఉత్సాహంతో ధోని జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లావుద్దీన్ అద్భుతదీపం తన వద్ద ఉన్నట్టుగా.. తలకు తగిలిన గాయాన్ని వారం రోజుల్లోనే మానేలా చేసుకున్నాడు. స్ట్రెచర్ పై వెళ్లిన వ్యక్తి.. దర్జాగా విమానాశ్రయం నుంచి నడుచుకుంటూ వచ్చాడు.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ముస్తాఫిజుర్ అనే ఆటగాడు ప్రాక్టీస్ చేస్తుండగా తలకు గాయమై వారం పాటు చికిత్స పొందాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో శ్రీలంక జట్టుతో జరిగిన టి20 సిరీస్ నాటికి అతడు కోలుకున్నాడు. టి 20 లతోపాటు వన్డే సిరీస్ కూడా ఆడాడు. వాస్తవానికి గాయం వల్ల ముస్తాఫిజుర్ కోలుకుంటాడా? చెన్నై జట్టుకు ఇబ్బంది తప్పదా? అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ అతడు కోలుకొని చెన్నై జట్టుతో కలిశాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆ దృశ్యాలను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

ముస్తాఫిజుర్ గత సీజన్ వరకు ఢిల్లీ జట్టులో ఆడాడు. ఈ సీజన్లో అతడు చెన్నై జట్టుకు మారాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేరుపొందిన ఇతడు.. చెన్నై జట్టుకు అత్యంత కీలకం కానున్నాడు. ఇప్పటికే చెన్నై జట్టు లంక యువ బౌలర్ మతిష పతిరాన ను దూరం చేసుకుంది. ఇతడు కూడా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్. అయితే అతడు జట్టుకు దూరం కావడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే ప్రశ్న వ్యక్తమైంది. ఆ ప్రశ్నకు సమాధానంగా ముస్తాఫిజుర్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. అయితే అతడు పూర్తిస్థాయిలో ఫిట్ గా ఉన్నాడా? ప్రాక్టీస్ లో తన పాత లయను దొరకబుచ్చుకున్నాడా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. ప్రారంభ మ్యాచ్లో చెన్నై జట్టు బెంగళూరు ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.