Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 20న ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వృషభ రాశివారికి పెండింగులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మరో రాశివారు ఓ శుభవార్తవ వింటారు. అలాగే ఏకాదశి కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొన్నిపనుల నిమిత్తం ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. వ్యాపారులు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విహార యాత్రలు చేస్తారు.
వృషభ రాశి:
వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. ఇతరుల నుంచి రుణాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఇతరుల సలహాలు తీసుకోవాలి.
మిథునం:
విద్యార్థులు కొన్ని విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది.వ్యాపారులు లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేరస్తారు. కుటంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.
కర్కాటకం:
ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. ఈ కారణంగా ఆందోళన చెందుతారు. వ్యాపారులు లాభాలను పొందుతారు. పాత స్నేహితులను కలుస్తారు.
సింహ:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు చేసే కొన్ని ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ఓ సమస్యలపై ఇతరులతో చర్చిస్తారు.
కన్య:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు తప్పిదాలు లేకుడా జాగ్రత్తగా నడుచుకోవాలి. కొన్ని రంగాల వారికి ఆకస్మికంగా ఆదాయం సమకూరుతుంది.
తుల:
ఈ రాశివారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని పనుల్లో అనుకున్న విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
కెరీర్ కు సంబంధించిన కొన్ని ప్రణాళికలు వేస్తారు. గతంలో పెండింగులో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెట్టుబడుల కోసం ఆదాయం సమకూరుతుంది.
ధనస్సు:
ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.
మకర:
విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొందరు మీ పనులకు అడ్డంకులు సృష్టిస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యక్తిగత విషయాలపై కొందరు జోక్యం చేసుకుంటారు.
కుంభం:
ముఖ్యమైన పనులు ఆలస్యం చేయొద్దు. ఏదైనా సమస్యపై తల్లిదండ్రులతో చర్చించాలి. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో దూరంగా ఉండాలి.
మీనం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో ఎక్కువగా వాదనలు చేయొద్దు. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు.