BJP vs Congress : బీజేపీ కొత్త మిత్రుల వేట కాంగ్రెస్ ని మరింత ఒంటరి చేయటానికే

బీజేపీ కొత్త మిత్రుల వేట కాంగ్రెస్ ని మరింత ఒంటరి చేయటానికే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీరాష్ట్రంలో బీజేపీ కొత్త, పాత పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించడానికి రెడీ అయ్యారు.

Written By: NARESH, Updated On : March 20, 2024 6:39 pm

BJP vs Congress : ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఫలితం ముందే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరినైనా అడగినా ఇదే చెబుతున్నారు. 99 శాతం కాంగ్రెస్ వాళ్లను అడిగినా చెబుతారు ఈసారి మోడీదే గెలుపు.. మోడీ మూడోసారి గెలుస్తారని అందరూ డిసైడ్ అయ్యారు. నాకు తెలిసి ఎప్పుడూ ఇది లేదు.

1951, 1955వ సంవత్సరంలో నెహ్రూనే గెలుస్తాడని అప్పుడు డిసైడ్ అయ్యారు. ఇక రెండోసారి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఎన్నికల్లో ఫలితం డిసైడ్ అయిపోయింది. రాజీవ్ గాంధీకి ఓవరాల్ గా ఏకపత్యంగా అధికారం ఇచ్చారు.

ఈసారి మోడీ మేనియాతో ఈసారి కూడా క్లియర్ కట్ విజయం సాధ్యమని చెబుతున్నారు. మోడీ నాయకత్వం ఈసారి ఆయనపై దేశ ప్రజల్లో అంతులేని ధీమాను కల్పించింది.

బీజేపీ కొత్త మిత్రుల వేట కాంగ్రెస్ ని మరింత ఒంటరి చేయటానికే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీరాష్ట్రంలో బీజేపీ కొత్త, పాత పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించడానికి రెడీ అయ్యారు.