IPL 2024 2nd Phase Schedule: క్రికెట్ అభిమానులకు బీసీసీఐ(BCCI) శుభవార్త చెప్పింది. ఐపీఎల్(Indian premier league) 17వ సీజన్ పోటీలకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది.. 23 రోజుల క్రితం మొదటి దశ షెడ్యూల్ ను బోర్డు ప్రకటించింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు లీగ్ మ్యాచ్ లు దేశంలోని వివిధ వేదికలో నిర్వహిస్తామని ప్రకటించింది. లీగ్ మ్యాచ్ ల విషయంలో క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ.. మిగతా మ్యాచ్ ల వివరాలను ప్రకటించలేదు. దేశంలో ఎన్నికలున్న నేపథ్యంలో ఐపీఎల్ లో మిగతా మ్యాచ్ లను విదేశాల్లో నిర్వహిస్తారని భావించారు. అయితే అభిమానులకు బీసీసీఐ సెక్రటరీ శుభవార్త చెప్పారు. మ్యాచ్ లు ఎట్టి పరిస్థితుల్లో విదేశాల్లో నిర్వహించబోమని ప్రకటించారు. బీసీసీఐ వర్గాల ప్రకారం త్వరలోనే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. 23 రోజుల క్రితం మొదటి దశ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. మరి కొద్ది రోజుల్లో టోర్నీ ప్రారంభవుతుందనుకుంటున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కొన్ని రాష్ట్రాలు, పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.. దీంతో మిగతా మ్యాచ్ లు విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. అందుకు తగ్గట్టుగానే బీసీసీఐ అడుగులు వేసింది.
ఇటీవల బీసీసీఐ అధికారులు దుబాయ్ లో పర్యటించారు. అప్పట్లో ఐపిఎల్ రెండవ దశను దుబాయ్ లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు వారు ప్రకటించారు. అనంతరం ఆటగాళ్ల నుంచి పాస్ పోర్ట్ లను ఫ్రాంచైజీ జట్లు అడిగాయి.. ఎందుకంటే దేశం అవతల జరిగే పోటీలకు ఆటగాళ్లు సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ఫ్రాంచైజీలు ఆటగాళ్ళను ఆ విధంగా అడిగాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. ఐపీఎల్ రెండవ దశ పోటీలను విదేశాల్లో నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వారంలోనే ఐసీసీ సమావేశం నిర్వహించనున్నారు. వాస్తవంగా విదేశాల్లో పోటీ నిర్వహించడం భారత ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే 2014 పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఐపీఎల్ పోటీలను బయట నిర్వహించినప్పుడు.. అప్పటి ప్రతిపక్ష బిజెపి కాంగ్రెస్ పార్టీని విమర్శించింది. ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ పోటీలను ఎన్నికల దృష్ట్యా బయట నిర్వహిస్తే.. ప్రతిపక్షాలు అధికార బీజేపీని విమర్శించే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో స్వదేశంలోనే పోటీలు నిర్వహించాలని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
2009, 2014, 2019లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో బీసీసీఐ పలు మార్పులు చేసింది. 2019 ఎన్నికల తర్వాత స్వదేశంలోనే ఈ మెగా టోర్నీని బీసీసీఐ నిర్వహించింది. 2014లో సగం పోటీలను దుబాయిలో నిర్వహించారు. 2009లో మొత్తం ఐపీఎల్ పోటీలను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఇక ప్రస్తుత 17వ సీజన్లో లీగ్ దశలో 21 మ్యాచ్ లు జరుగుతాయి.న్ ఇందులో నాలుగు డబుల్ హెడర్ లు (ఒకే రోజులో రెండు మ్యాచ్ లు) నిర్వహిస్తారు. చెపాక్ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు జట్ల మధ్య మార్చి 22న తొలి మ్యాచ్ జరుగుతుంది.