https://oktelugu.com/

IPL 2022- RR vs RCB: రాజ‌స్థాన్ పై ఆర్సీబీ విక్ట‌రీ.. షాబాజ్‌, దినేశ్ మెరుపు ఇన్నింగ్స్.. ఇది క‌దా ఐపీఎల్ అంటే..

IPL 2022- RR vs RCB: ఇన్ని రోజులు ఐపీఎల్ లో నువ్వా నేనా అనే పోటీ కొంచెం క‌రువైంది. భారీ స్కోర్లు న‌మోద‌వుతున్నాయి తప్ప‌.. వాటిని చేధించి గెలిచిన మ్యాచ్‌లు మాత్రం క‌నిపించ‌లేదు. అయితే ఈ లోటును నిన్న రాత్రి ఆర్సీబీ పూడ్చేసింది. అస‌లైన ఐపీఎల్ మజా అంటే ఏంటో రుచి చూపించింది. త‌ద్వారా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై విజ‌య జెండా ఎగ‌రేసింది. ఇప్ప‌టికే రాజ‌స్థాన్ వరుసగా రెండు విజ‌యాల‌తో జోరు మీద […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 6, 2022 8:43 am
    Follow us on

    IPL 2022- RR vs RCB: ఇన్ని రోజులు ఐపీఎల్ లో నువ్వా నేనా అనే పోటీ కొంచెం క‌రువైంది. భారీ స్కోర్లు న‌మోద‌వుతున్నాయి తప్ప‌.. వాటిని చేధించి గెలిచిన మ్యాచ్‌లు మాత్రం క‌నిపించ‌లేదు. అయితే ఈ లోటును నిన్న రాత్రి ఆర్సీబీ పూడ్చేసింది. అస‌లైన ఐపీఎల్ మజా అంటే ఏంటో రుచి చూపించింది. త‌ద్వారా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై విజ‌య జెండా ఎగ‌రేసింది.

    IPL 2022- RR vs RCB

    IPL 2022- RR vs RCB

    ఇప్ప‌టికే రాజ‌స్థాన్ వరుసగా రెండు విజ‌యాల‌తో జోరు మీద ఉంది. ఈ క్ర‌మంలోనే సంజూ సామ్సన్ నాయ‌క‌త్వంలోని జ‌ట్టు హ్యాట్రిక్ విజ‌యం అందుకుంటుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ ఆర్సీబీ ఆ ఆశ‌లపై నీళ్లు పోసింది. 4 వికెట్ల తేడాతో బెంగళూరు ఘనవిజయం అందుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 ర‌న్స్ మాత్ర‌మే చేసింది.

    Also Read: Praja Sangrama Padayatra: ప్రజాసంగ్రామ యాత్రతో టీఆర్ఎస్ కు బీజేపీ చెక్ పెట్టనుందా?

    ఇందులో బట్లర్ 47 బంతుల్లో 6 సిక్సర్లతో 70 ప‌రుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అత‌నికి తోడుగా దేవ్ దత్ పడిక్కల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 ర‌న్స్ చేశాడు. వీరిద్ద‌రి ప్ర‌య‌త్నానికి తోడుగా చివ‌ర‌గా హెట్ మైర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 ర‌న్స్ చేసి ప‌ర్వాలేద‌నిపించాడు. ఫ‌లితంగా 169 ప‌రుగులు వ‌చ్చాయి.

    IPL 2022- RR vs RCB

    IPL 2022- RR vs RCB

    ఇక 170 పరుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీని షాబాజ్‌, దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ తో విజ‌య తీరాన నిలిపారు. ఫ‌లితంగా 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులతో విజ‌యాన్ని న‌మోదు చేసింది ఆర్సీబీ. ఓపెనర్లు డుప్లెసిస్ (29), అనుజ్ రావత్ (26) ఆరంభంలో అద్భుతంగా ఆడ‌టంతో మిడిల్ ఆర‌డ్ర్‌పై ఒత్తిడి త‌గ్గింది. అయితే ప్ర‌పంచ మేటి ఆట‌గాడు కోహ్లీ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. కోహ్లీ 5 ప‌రుగుల వ‌ద్ద రనౌట్ అయ్యాడు. వీరి త‌ర్వాత వ‌చ్చిన షాబాజ్ అహ్మద్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో క‌లిపి 45 ప‌రుగులు చేశాడు. ఇక అత‌నికి తోడుగా దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 44 నాటౌట్ గా నిలిచి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు.

    Also Read:Revanth Reddy vs KTR- Pub Drugs Case: డ్రగ్స్ కేసులో మరోసారి కేటీఆర్, రేవంత్ రెడ్డి సవాళ్లు

    Tags