IPL 2022- RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇంకా ఆరు మ్యాచులు మాత్రమే ఉన్నాయి. మూడు ప్లే ఆఫ్ బెర్తుల కోసం ఏడు జట్ల మధ్య పోటీ ఏర్పడింది. దీంతో ఏ జట్లు ప్లే ఆఫ్ కు చేరుతాయో తెలియడం లేదు. ఏ జట్లకు అదృష్టం వరించనుందో అర్థం కావడం లేదు. సునాయాసంగా ప్లే ఆఫ్ చోటు ఖాయం చేసుకోవాల్సిన జట్లు స్వయంకృతాపరాధంతో ఓటమి అంచుల్లో నిలిచి ఇప్పుడు అవకాశాలను సంక్లిష్టం చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక చావో రేవో అనే ధోరణిలో ఆడాల్సిన బాధ్యత నెలకొంది. ఎలాగైనా నెగ్గితేనే తమకు బెర్తు ఖాయమనే విషయం తెలుస్తోంది.
రాయల్ చాలెంజర్స్ 14 పాయింట్లతో పతకాల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గురువారం గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచులో భారీ విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితంప ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో జట్టు కోసం గతంలో ఆడిన ఇద్దరు ఆటగాళ్లను హాట్ ఆఫ్ ఫ్రేమ్ అవార్డుతో సత్కరించింది. డీవిలియర్స్ 11 ఏళ్ల పాటు క్రిస్ గేల్ 7 ఏళ్ల పాటు సేవలందించారు.
Also Read: Sohail Khan And Seema Khan: భార్యతో స్టార్ హీరో విడాకులు.. ఆ హీరోయిన్ కోసమేనా?
ఈ కార్యక్రమానికి ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి మాట్లాడుంటే డీవిలియర్స్, గేల్ భావోద్వేగానికి గురయ్యారు. ఆర్సీబీ జట్టు చేసిన పనికి అందరు ప్రశంసించారు. జట్టుకు ఎన్నో విజయాలు అందించిన వారిని గుర్తుంచుకుని మరీ వారికి సన్మానం చేయడం గొప్ప విశేషం.
2016లో జట్టును చాంపియన్ గా నిలిపిన డేవిడ్ వార్నర్ ను మాత్రం సన్ రైజర్స్ పట్టించుకోలేదు. సరికదా అవమానించింది. 2021 సీజన్ లో జరిగిన మ్యాచుల్లో వార్నర్ ను బెంచీకే పరిమితం చేసి పక్కన పెట్టింది. దీంతో వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున ఆడుతున్నాడు. మాజీ ఆటగాళ్లను ఎలా గౌరవించాలో ఆర్సీబీని చూసి నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. సన్ రైజర్స్ బుద్ధి తెచ్చుకుని నడుచుకోవాలని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ బెర్తుల కోసం అన్ని జట్టు సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ సన్ రైజర్స్ కూడా ఐదు మ్యాచుల్లో ఓటమి చెందడంతో ఇప్పుడు జరిగే రెండు మ్యాచులు కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఏ మేరకు నైపుణ్యం ప్రదర్శంచి విజయాలు సాధిస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Also Read:Kailasa Temple Mystery: మిస్టరీ కైలాస పాతాళ గుడి.. ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అతిపెద్ద రహస్యమే?