Homeఎంటర్టైన్మెంట్Akkineni Akhil: షూటింగ్ సెట్స్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై అక్కినేని అఖిల్ ఫైర్.

Akkineni Akhil: షూటింగ్ సెట్స్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై అక్కినేని అఖిల్ ఫైర్.

Akkineni Akhil: అక్కినేని కుటుంబం నుండి భారీ హైప్ తో వచ్చిన హీరో అక్కినేని అఖిల్..నాగార్జున తనయుడిగా అఖిల్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది..కానీ ఆయన టైం బాడ్ అవ్వడం వలనో ఏమో తెలీదు కానీ,మొదటి సినిమానే భారీ ఫ్లాప్ గా నిలిచింది..ఇక రెండవ చిత్రం హలొ పర్వాలేదు అని అనిపించినా , బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది..ఇక మూడవ చిత్రం మజ్ను కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది..అయితే తన లాస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది..

Akkineni Akhil
Akhil Akkineni

అలా కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్న అఖిల్ తన తదుపరి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు..ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తో ఆయన ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా సాగుతుంది..ఈ సినిమా కోసం అక్కినేని అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ పెంచాడు..ఆయనకీ సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి కూడా అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..

అన్ని రాకులు పాజిటివ్ బజ్ ని ఏర్పర్చుకున్న ఈ సినిమా పై గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త అక్కినేని అభిమానులను కలవర పెడుతుంది..అదేమిటి అంటే ఈ సినిమా ఔట్పుట్ విషయం లో అఖిల్ చాలా నిరాశకి గురి అయ్యాడు అట..చాలా సన్నివేశాలు రీ షూట్ చేసినప్పటికీ కూడా ఎందుకో కావాల్సిన ఎమోషన్ మిస్ అవుతుంది అని అఖిల్ కంగారుపడుతున్నారు అట..

Also Read: Kailasa Temple Mystery: మిస్టరీ కైలాస పాతాళ గుడి.. ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అతిపెద్ద రహస్యమే?

ఇది పక్కనే పెడితే సురేందర్ రెడ్డి తొలుత ఈ సినిమాకి పారితోషికానికి బదులు, లాభాల్లో వాటా అడిగాడు..అంతే కాకుండా తానూ స్థాపించిన బ్యానర్ కూడా ఈ మూవీ టైటిల్ కార్డ్స్ అప్పుడు పడాలి అనే ఒప్పందం చేసుకున్నాడు అట సురేందర్ రెడ్డి..కానీ ఇప్పుడు నాకు వాటాలు వద్దు పారితోషికం ఇవ్వండి అంటూ నిర్మాతలను డిమాండ్ చేస్తున్నాడు అట సురేందర్ రెడ్డి, అంటే సినిమా ఔట్పుట్ మీద ఆయనకీ కూడా నమ్మకం లేదా అనే సందేహాలు అక్కినేని అభిమానుల్లో నెలకొన్నాయి..అంతే కాకుండా నిర్మాతతో సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కూడా అఖిల్ చాలా కోపం మీద ఉన్నట్టు తెలుస్తుంది..మాటికొస్తే రీ షూట్స్ కోసం దర్శకుడు అఖిల్ ని అడుగుతూ ఉండడం తో షూటింగ్ సెట్స్ లో కూడా అఖిల్ డైరెక్టర్ పై ఫైర్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Akkineni Akhil
Surender Reddy

Also Read: Uttar Pradesh Noida: ఏడేళ్లుగా 17 ఏళ్ల బాలికపై 81 ఏళ్ల వృద్ధుడి డిజిటల్ రేప్

Recommended Videos
మహేష్ బాబు మాస్ స్టెప్పులు | Mahesh Babu Mass Steps on Stage At Kurnool | SVP Success Meet
SVP నెగటివ్ టాక్ తో కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ |SVP Set New Records |Oktelugu Entertainment
మళ్లీ గీతగోవిందం కాంబినేషన్.. ఈ సారి ట్రిపుల్ ధమాకా || Vijay Deverakonda ||Director Parasuram

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version