Mumbai Indians: IPL 2022 కొందరికి ఓటమి బాధిస్తుంది. కానీ ఆ ఓటమియే మరికొందరికి కలిసి వస్తోంది. గెలవాలన్న కసిని పెంచుతుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కు అదే పరిస్థితి ఎదురైంది. తెలుగు స్టార్ హీరో మహేష్ బాబుకు తన సినిమా ముహూర్తం ఎలాగైతే కలిసిరాదో.. ఐపీఎల్ టీం ముంబైకి తొలి మ్యాచ్ కూడా అంతే. వాళ్లు తొలి మ్యాచ్ లో ఓడిపోతే కప్ కొట్టేస్తుంటారు. చరిత్ర అలా చెబుతోంది మరీ. తాజాగా ఈ సీజన్ లోనూ తొలి మ్యాచ్ లో ముంబై ఓడిపోయి మరోసారి కప్ పై ఆశలు పెంచుకుంది.
ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ లోనే అత్యంత విజయవంతమైన జట్టు.. ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ కప్ కొట్టిన జట్టు కేవలం ముంబై మాత్రమే. అయితే ఆ టీంకు ఓ పాడు అలవాటు ఉంది. ప్రతి సీజన్ లోనూ తొలి మ్యాచ్ లో ఓడిపోతూనే ఉంటుంది. ముంబై ఖాతాలో ఇదో చెత్త రికార్డుగా చెప్పొచ్చు. 2013 ఐపీఎల్ నుంచి ఇప్పటివరకూ ఐపీఎల్ సీజన్లలో ఒక్క ఆరంభ మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ గెలవలేదు. దీంతో వరుసగా పది సీజన్లలో తొలి మ్యాచ్ ఓడిపోయిన జట్టుగా ముంబై ఇండియన్స్ ఈ రికార్డును మూటగట్టుకుంది.
Also Read: Junior NTR- TDP: జూనియర్ ఎన్టీఆర్ తోనే టీడీపీకి మనుగడ ఉందా?
ఐపీఎల్ 2022 మెగా టీ20 టోర్నీలో ఆదివారం ఢిల్లీతో తలపడిన తొలి మ్యాచ్ లో ముంబై ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 177 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ప్రత్యర్థి ఢిల్లీని మాత్రం ఆ స్కోరు లోపే కట్టడిచేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 177 పరుగుల భారీ స్కోర్ సాధించినా ప్రత్యర్థిని కట్టడి చేయలేక చేతులెత్తేసింది. దీంతో ఢిల్లీ 18.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ ఓటమితో ముంబై చెత్త రికార్డును మరోసారి లిఖించుకుంది. వరుసగా ఐపీఎల్ పదోసీజన్ లోనూ ఇలా తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన జట్టుగా నిలిచింది.2009 నుంచి 2012 వరకూ వరుసగా నాలుగేళ్లు తొలి మ్యాచ్ లను ముంబై ఇండియన్స్ గెలుపొందింది. 2013 నుంచి ఇప్పటి 2022 వరకూ ఒక్కసారి కూడా లీగ్ దశలో తొలి మ్యాచ్ గెలిచింది లేదు.
అయితే ఐపీఎల్ లోనే ఇలా తొలి మ్యాచ్ లో ఓడి ఐదు సార్లు చాంపియన్ గా ముంబై ఇండియన్స్ నిలవడం విశేషం. దీన్ని ముంబై టైటిల్ గెలవాలంటే తొలి మ్యాచ్ లో ఓడిపోతేనే మంచిదని ఆ జట్టు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఇక కొందరైతే కప్ కొట్టేందుకే ఫస్ట్ మ్యాచ్ లో ముంబై ఆటగాళ్లు ఆ సెంటిమెంట్ కోసం ఓడిపోతుంటారని సెటైర్లు వేస్తున్నారు. అలా ఓడిపోతే కప్ కొడుతామని ఇలా చేస్తుంటారని సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తుతున్నాయి. ఇది నిజమా? మరి నిజంగానే ముంబై ఓడుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: Jagan Suffered For Gautam Reddy: గౌతమ్‌ను తలచుకుని బాధపడ్డ జగన్.. రాజకీయ హామీ లేనట్టేనా..?