https://oktelugu.com/

MS Dhoni: మళ్లీ పాత ధోని.. బెస్ట్ ఫినిషర్ బయటకొచ్చాడు..

MS Dhoni:  ఎంఎస్ ధోని.. ఒకప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్. అతడు కెప్టెన్సీ చేపట్టాక భారత క్రికెట్ జట్టు రూపురేఖలు మార్చడమే కాదు.. చివర్లో వచ్చి మ్యాచ్ లు గెలిపిస్తూ బెస్ట్ ఫినిషర్ గా ఎదిగాడు. ధోని ఉంటే జట్టు గెలవడం పక్కా అని అభిమానులు గుండెల మీద చేయి వేసుకొని ధీమాగా ఉండేవారు. అలాంటి మేటి ఆటగాడు రిటైర్ మెంట్ తర్వాత మాత్రం ఆ మెరుపులు మెరిపించడం లేదు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాక.. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2022 / 09:55 AM IST
    Follow us on

    MS Dhoni:  ఎంఎస్ ధోని.. ఒకప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్. అతడు కెప్టెన్సీ చేపట్టాక భారత క్రికెట్ జట్టు రూపురేఖలు మార్చడమే కాదు.. చివర్లో వచ్చి మ్యాచ్ లు గెలిపిస్తూ బెస్ట్ ఫినిషర్ గా ఎదిగాడు. ధోని ఉంటే జట్టు గెలవడం పక్కా అని అభిమానులు గుండెల మీద చేయి వేసుకొని ధీమాగా ఉండేవారు. అలాంటి మేటి ఆటగాడు రిటైర్ మెంట్ తర్వాత మాత్రం ఆ మెరుపులు మెరిపించడం లేదు.

    MS Dhoni

    అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాక.. ధోనికి వయసు మీద పడి మునుపటిలా మ్యాచ్ లు ఆడడం లేదు. గెలిపించడం లేదు. గత రెండేళ్లుగా పెద్దగా టీంను గెలిపించిన దాఖలాలు లేవు. అడపా దడపా ఆడడమే కానీ.. మ్యాచ్ ఫినిషింగ్ రోల్ ను మాత్రం సరిగ్గా నిర్వర్తించలేదు.

    తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ముంబై ఓటమి చవి చూసింది. ముంబై నిర్ధేశించిన 156 పరుగుల టార్గెట్ ను చెన్నై 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి ఓవర్ లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. ఎంఎస్ ధోని (28) ఫినిషర్ గా మరోసారి పాత ధోనిని గుర్తుకు తెచ్చాడు. చివరి నాలుగు బంతుల్లో బౌండరీల మోత మోగించాడు. దీంతో చివరి బంతికి సీఎస్కే విజయం సాధించింది. మూడు వికెట్లతో ఉత్కంఠ భరితంగా ముంబైపై విక్టరీ కొట్టింది.

    Also Read: Jr NTR: ఆ హీరో స్ఫూర్తితోనే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష..!

    ముంబైతో మ్యాచ్ లో ఎంఎస్ ధోని మరోసారి ‘ఫినిషర్’ అవతారమెత్తాడు. ధోని ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో ఒక సిక్స్, 3 ఫోర్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సరిగ్గా 20 ఓవర్లలోనే ఏడు వికెట్లను కోల్పోయి ఛేదించింది. చివరి ఓవర్ లో 17 పరుగులు కొట్టాల్సిన తరుణంలో ధోని ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టి చెన్నైకి విజయాన్ని అందించాడు.

    స్ట్రైకింగ్ తీసుకున్న ధోని చివర్లో అద్భుతం చూపించాడు. వరుసగా 6,4,2,4 కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఐపీఎల్ లో ఆఖరి 4 బంతుల్లో 16 పరుగులు చేసి తన జట్టును రెండోసారి గెలిపించిన తొలి ఆటగాడిగా ధోని నిలిచాడు.

    2016లోనూ మహేంద్ర సింగ్ ధోని ఇటువంటి ప్రదర్శనే చేశాడు. అప్పుడు ధోని రైజింగ్ పూణే సూపర్ జెయిట్స్ తరుఫున బరిలోకి దిగి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో కూడా చివరి నాలుగు బంతుల్లో ఫూణే విజయానికి అవసరమైన 16 పరుగులు చేశాడు. తొలి రెండు బంతుల్లో 4 పరుగులు రాగా.. ఆ తర్వాతి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.

    ఇలా ధోని పని అయిపోయిందని అనుకుంటున్న వారికి నాలుగు పదుల వయసులోనూ సత్తా చాటుతున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడు తనదైన శైలిలో ధనాధన్ షాట్లతో అదరగొడుతున్నాడు.

    Also Read: Bommala Koluvu: రివ్యూ : – ‘బొమ్మ‌ల‌కొలువు’

    Recommended Videos: