Shreyas Iyer: పొట్టి క్రికెట్ వేడుక ఐపీఎల్ 2022కు సంబంధించిన ప్లేయర్స్ రిటెన్షన్ కు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ఈ అంశంపై అన్ని ప్రాంచేజీలు తీవ్రమైన కసరత్తు చేశాయి. అన్ని ప్రాంచేజీలు వ్యూహంతో మందుకు సాగగా.. సీనియర్ ప్లేయర్లకే పెద్దపీఠవేశాయి. ఈ క్రమంలో కొంతమంది యువప్లేయర్లు.. అన్ క్యాష్ ప్లేయర్లు కూడా ఇక్కడ లక్కీచాన్స్ కొట్టేశారు. ఐపీఎల్ లో మొదటిశ్రేణి ఆటగాళ్లయిన ధోనీ, కోహీ, రోహిత్, కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యార్ ను ఆయా ప్రాంచేజీలు రిటెన్షన్ చేసుకున్నాయి. ఒక్కో ఆటగాడిపై రూ.కోట్ల వర్షం కురిసింది. ప్రాంచేజీలు ఆచితూచి వ్యవహరిస్తూ.. పెద్దమొత్తంలో వారిపై పెట్టుబడి పెట్టారు. 32మంది ప్లేయర్లతో 27మందిని ఇప్పటి వరకు రిటెన్షన్ చేసుకున్నారు. ఇందులో శ్రేయస్ అయ్యార్ కోసం భారీగానే పోటీపడే అవకాశం కూడా కనిపిస్తోంది.
2020 ఐపీఎల్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్ టీంను శ్రేయస్ అయ్యార్ విజయవంతంగా నడిపించారు. వ్యూహాత్మక ఆటతో జట్టును ఫైనల్ కు చేర్చాడు. అయితే ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిపోగా.. రన్నరప్ గా నిలిచింది. శ్రేయస్ అయ్యార్ 2021 ఐపీఎల్ కు గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో పంత్ పగ్గాలు చేపట్టగా.. తాజా ఐపీఎల్ వేలానికి ముందు అయ్యార్ ను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు తీసిన అయ్యార్ ను ఈసారి ఐదు ప్రాంచేజీలు దక్కించుకునేందుకు భారీగానే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా అయ్యార్ కోసం పోటీ పడుతోంది.
Also Read: Captain Virat Kohli: కెప్టెన్సీగా కోహ్లీ భవితవ్యం తేలేది ఎప్పుడంటే?
కోహ్లీ, సిరజ్, మాక్స్ వెల్ ను మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్సీబీ అయ్యార్ కోసం భారీగానే పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ కు అయ్యార్ అంటే అభిమానం. తనను జట్టులోకి తీసుకురావాలని పరోక్షంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించేందుకు ప్రయత్నం చేసే పంజాబ్ టీంకు రాహుల్ దూరం కావడంతో శ్రేయస్ సేవలు అవసరమయ్యాయని చెప్పవచ్చు. కొత్త ప్రాంచేజీలైన అహ్మదాబాద్, లక్నో కూడా అయ్యర్ ను తీసుకుని తొలి అడుగులోనే టైటిల్ పై గురిపెట్టాలని చూస్తున్నాయి. మొత్తంగా ప్రస్తుత 2022 ఐపీఎల్ కు సంబంధించి శ్రేయస్ అయ్యార్ కీలక ఆటగాడిగా తయారయ్యాడు. ప్రాంచేజీల కన్ను అతడిపై ఉండడంతో కోట్లు వెచ్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Shreyas Aiyer: ‘అయ్యర్’ కోసం అతడిపై వేటు పడనుందా?