Atrangi Re: ‘ఆత్రంగీ రే’ టైటిల్​పై దర్శకుడికి సల్మాన్ షరతు…

Atrangi Re: సినిమా ఎంత బాగా తీసినా.. టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్​గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ వ్యవహారంలోనే పెద్ద పెద్ద గొడవలు అవుతుంటాయి. ఈ క్రమంలోనే గతంలో చాలా సార్లు టైటిల్ విషయంలో కొంత మంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడటం మనం చూశాం. అందులో కొంత మంది సర్దుకుపోతుంటే.. మరికొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే, బాలీవుడ్​ సినిమా అత్రంగీరే ప్రస్తుతం ఈ విషయంపై చర్చలోకి వచ్చింది. ఈ సినిమాపై […]

Written By: Raghava Rao Gara, Updated On : December 4, 2021 1:43 pm
Follow us on

Atrangi Re: సినిమా ఎంత బాగా తీసినా.. టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్​గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ వ్యవహారంలోనే పెద్ద పెద్ద గొడవలు అవుతుంటాయి. ఈ క్రమంలోనే గతంలో చాలా సార్లు టైటిల్ విషయంలో కొంత మంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడటం మనం చూశాం. అందులో కొంత మంది సర్దుకుపోతుంటే.. మరికొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు.

salman-khan-condition-to-atrangi-re-movie-title

అయితే, బాలీవుడ్​ సినిమా అత్రంగీరే ప్రస్తుతం ఈ విషయంపై చర్చలోకి వచ్చింది. ఈ సినిమాపై తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్​ దర్శకుడు ఆనందర్ ఎల్​ రాయ్​కు షరతులు విధించాడట. ఈ విషయాన్ని ఆ దర్శకుడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Also Read: ధోనీతో బ్రేకప్​పై నటి లక్ష్మీ రాయ్​ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆనంద్​ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెరకెక్కిన రెండు సినిమాలు రక్షా బంధన్​, అంత్రంగి రే.. టైటిల్స్​ను రిజిస్టర్ చేయించడానికి ఫిల్మ్​ అసోషియేషన్​ వద్దకు వెళ్లారట. అయితే, అప్పటికే ఆత్రంగి రే టైటిల్​ను సల్మాన్ ఖాన్ తన ప్రొడక్షన్ హౌస్​ పేరుతో రిజిస్టర్​ చేయించుకున్నారట . టైటిల్ కోసం సల్మాన్​కు కలవగా ఆయన ఓ షరతు పెట్టారట.. ఈ సినిమాను ఆనంద్​ దర్శకత్వం వహిస్తేనే టైటిల్ ఇస్తానని అన్నారట. లేదంటే ఆ టైటిల్​ను వదిలే ప్రసక్తే లేదని సల్మాన్ చెప్పినట్లు సమాచారం. ఆ అంగీకారం ప్రకారమే ఆయనే ఈ సినిమాను తెరకెక్కించారు.

కాగా, ఆనందర్ ఎల్​ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిసిన సినిమా ఆత్రంగి రే సినిమాలో సారా అలీఖాన్​, అక్షయ్​ కుమార్​, ధనుష్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్​స్టోరీని చూపించబోతున్నారు. కాగా, ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: హైదరాబాద్​కు దీపికా.. ప్రభాస్​ సినిమా షూటింగ్​ కోసమేనట?