RCB vs KKR: ఐపీఎల్ 14 సీజన్ మ్యాచ్ లు కీలక దశకు చేరుకున్నాయి. తుదిపోరుకు చేరుకునేందుకు జట్లు తమ శక్తిని ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీని ఢీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనూహ్య విజయంతో ఫైనల్ కు చేరి .. టైటిల్ దక్కించుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఢిల్లీకి మరో అవకాశం ఉండగా.. ఢిల్లీతో ఢీకొట్టే జట్టు ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే టైటిల్ వేటలో రాజల్ చాలెంజ్ బెంగళూరు జట్టుకు ఇదీ కఠిన పరీక్షే.. కెప్టెన్ గా కోహ్లీ చివరి టోర్నీ కావడంతో ట్రోఫీ అందించాలనే ఆత్రుతతో ఉన్నాడు. మరో బలమైన టీం అయిన కోల్ కత్తా నైట్ రైడర్స్ కూడా టైటిల్ పై గురి పెట్టింది. మరొకొద్ది గంటల్లో ఎవరు తుదిపోరులో నిలుస్తారనేది తేలనుంది.

ఐపీఎల్ సీజన్ 14లో బెంగళూరు జట్టుతో పాటు కోల్ కత్తా టీం రెండూ సమబలంగా ఉన్నాయి. ఈ సీజన్ లో అయితే.. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లో రెండు జట్లు సమానంగా గెలిచాయి. 14 మ్యాచ్ లలో 9 విజయాలతో మూడోస్థానంలో బెంగళూరు జట్టు ఉంది. 14 పాయింట్లతో చివరిస్థానంలో కోల్ కత్తా టీం కొనసాగుతోంది. అయితే ఆర్సీబీ బలమైన జట్టు.. మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తూ.. వస్తోంది. చివరి మ్యాచ్ లో ఢిల్లీపై చివరి బంతికి సిక్స్ బాదేసిన కేఎస్ భరత్ లాంటి బ్యాట్స్ మెన్ జట్టులో ఉండడం ఆర్సీబీకి కొండంత అండగా నిలుస్తోంది. ఇతడితో పాటు ఓపెనర్లు దేవ్ దత్ పడిక్కల్, కోహ్లీ మంచి ఫాంలో ఉన్నారు. మిగితా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది. బౌలర్లు కూడా ప్రత్యర్థికి గట్టి పోటీనిస్తున్నారు.
కోల్ కత్తా నైట్ రైడర్స్ కూడా టైటిల్ పై దృష్టి సారించారు. కోల్ కత్తా కూడా బలమైన టీం. రికార్డులు సృష్టించే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. తుది టైటిల్ పోరులో రెండు అడుగుల దూరంలో ఉన్నారు. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. ఢిల్లీలో వీరు ఢీకొట్టాల్సి ఉంటుంది. అక్కడ గెలిస్తే. చెన్నైతో ఫైనల్ మ్యాచ్ ఆడుంది. చూడాలి మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో.. ఏ జట్టు ఇంటిదారి పడుతుందో..అని..