Sajjanar: టీఎస్ ఆర్టీసీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఆర్డీసీకి లాభాలు తెచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందజేస్తున్నారు. వారితో పనులు చేయించుకుని సంస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పక్క రాష్ర్టంతో పోటీ పడుతూ సంస్థను లాభాల దిశలో నడిపించేందుకు పలు కీలక నిర్ణయాలు వెలువరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో దసరా సందర్భంగా యాభై శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. మన బస్సులు కూడా ఏపీకి నడుస్తున్నందున అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు బస్సుల్లో ఎక్కేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఓ సముచిత నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్ధపడటం లేదు. యాభై శాతం చార్జీలు పెంచకుండా నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సుల్లోనే ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు.
గతంలో బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. తెలంగాణ బస్సుల్లోనే వెళ్లేందుకు ముందుకు వస్తున్నారు.దీంతో తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. టికెట్ల రేట్లు తగ్గించి తన ఆదాయం సమకూర్చుకుంటోంది. దీంతో ఏపీ బస్సుల్లో జనం కనిపించడం లేదు. అందరు తెలంగాణ బస్సుల్లోనే ఎక్కుతున్నారు.
కరోనా లాక్ డౌన్ తరువాత తెలలంగాణ, ఏపీ మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఏపీ తెలంగాణకు ఎన్ని బస్సులు తిప్పితే అన్ని బస్సులు మనం కూడా తిప్పుకోవచ్చు. దీంతో ఏపీకి వెళ్లే బస్సుల్లో లాభాలు తెచ్చుకునేందుకు సజ్జనార్ అమలు చేసిన విధానంతో లాభాలు గడించనుంది. దీంతో సంస్థ ఆదాయం పెరగనుంది. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడ కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి సజ్జనార్ వ్యూహం బాగానే పని చేస్తోందని ఉద్యోగులు ప్రశంసిస్తున్నారు.