
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్. 14 వ ఎడిషన్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎప్పటిలాగానే ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఈ విధంగా వరుసగా అపజయాలు ఎదురవుతున్న సన్రైజర్స్ ప్రస్తుత పరిస్థితులలో ఆట గెలవడం కూడా ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఈసారి ఏకంగా జట్టులో నాలుగు కీలకమైన మార్పులు చోటు చేసుకున్నప్పటికీ సన్ రైజర్స్ కి మాత్రం ఓటమి తప్పలేదు.
కొత్తగా నలుగురు జట్టులోకి రావడంతో ప్రత్యర్థిపై గెలుపు సాధిస్తుందనే నమ్మకాన్ని కూడా వమ్ము చేశారు. ఇది వరకు సన్ రైజర్స్ ఆడిన మూడు ఆటలలో విజయం అంచుల దాకా వెళ్లి ఓటమిపాలైంది.కోల్‌కత నైట్ రైడర్స్‌పై 10, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆరు పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. తాజాగా 13 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైంది.
ఈ విధమైనటువంటి పరిస్థితిలో సన్ రైజర్స్ జట్టులో కేన్ విలియమ్ ఉండి ఉంటే ఆ మూడు మ్యాచ్ ల ఫలితాలు వేరే విధంగా ఉండేవని అభిమానులు భావిస్తున్నారు.
టాప్ ఆర్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమౌతోన్న నేపథ్యంలో ఆ ఇద్దరి స్థానంలో కేన్ విలియమ్స్ కు స్థానం కల్పిస్తే సన్ రైజర్స్ ఓటమి పాలు కాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ జట్టులోకి కేన్ ఎప్పుడు వస్తారా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిణామాలపై హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్.. కీలక అప్‌డేట్ ఇచ్చాడు. కేన్ ఎప్పుడొస్తాడనేది చెప్పనప్పటి, త్వరలోనే వస్తున్నారనే సమాచారం తెలియజేశారు. మ్యాచ్ అనంతరం డేవిడ్ విలియమ్స్ గాయంపై స్పందించారు. తాను ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడానని, విలియమ్స్ రీ ఎంట్రీ ఆశించిన స్థాయిలోనే ఉంటుంది అంటూ డేవిడ్ తెలియజేశారు.