https://oktelugu.com/

IPL 2021: క్రికెట్ ఫీవర్ షురూ.. నేటి రాత్రి ఐపీఎల్ రెండో దశ ప్రారంభం.. జట్ల మార్పులివీ

IPL 2021: కరోనా లాక్ డౌన్ తర్వాత ఎంటర్ టైన్ మెంట్ లేక మొహం వాచిన ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే ఆ సందడితో ఊపిరివస్తోంది. ఓవైపు బుల్లితెరపై బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు షోలతోపాటు.. కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ రెండో ఈరోజు రాత్రి మొదలు కాబోతుండడంతో క్రికెట్ ఫీవర్ మొదలుకాబోతోంది. దీంతో ఈ ఆదివారం డబుల్, త్రిబుల్ బోనాంజగా ఉంది. ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులు ఈరోజు నుంచి యూఏఈలో ప్రారంభం కాబోతున్నాయి. అసలు సిసలు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2021 / 11:20 AM IST
    Follow us on

    IPL 2021: కరోనా లాక్ డౌన్ తర్వాత ఎంటర్ టైన్ మెంట్ లేక మొహం వాచిన ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే ఆ సందడితో ఊపిరివస్తోంది. ఓవైపు బుల్లితెరపై బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు షోలతోపాటు.. కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ రెండో ఈరోజు రాత్రి మొదలు కాబోతుండడంతో క్రికెట్ ఫీవర్ మొదలుకాబోతోంది. దీంతో ఈ ఆదివారం డబుల్, త్రిబుల్ బోనాంజగా ఉంది.

    ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులు ఈరోజు నుంచి యూఏఈలో ప్రారంభం కాబోతున్నాయి. అసలు సిసలు క్రికెట్ వినోదం అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ స్పోట్స్ చానెల్స్ తోపాటు హాట్ స్టార్ యాప్, జియోటీవీలో ఈ లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

    ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపబడబోతున్నాయి. గత ఏడాది కూడా యూఏఈలో ఐపీఎల్ ను నిర్వహించి విజయవంతం చేశారు. ఈసారి కూడా దుబాయ్, అబుదాబి, షార్జా క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి.

    ఐపీఎల్ 2021 రెండో అర్థభాగంలో 27 రోజుల్లో మొత్తం 31 మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 8న లీగ్ స్టేజ్ లో చివరి మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆర్సీబీ ఢీకొడుతుంది.

    మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ అక్టోబర్ 10న దుబాయ్ లో జరుగుతుంది. ఎలిమినేటర్, క్వాలిఫైయర్2 మ్యాచ్ లు షార్జా వేదికగా అక్టోబర్ 11, అక్టోబర్ 13న జరుగుతాయి.

    దుబాయ్ లో నేడు రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్, ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ లోనే రెండు బలమైన జట్లు పోటీపడుతుండడంతో అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. ఈసారి స్టేడియంలోకి ప్రేక్షకులను కూడా అనుమతిస్తుండడంతో సందడి రెట్టింపు కానుంది.

    ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ టాప్ లో ఉంది. 12 పాయింట్లతో ఢిల్లీ కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా చెన్నై, బెంగళూరు, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏప్రిల్ లో ఆగిపోయిన ఐపీఎల్ నాలుగు నెలల తర్వాత మల్లీ మొదలు కాబోతోంది. ముంబై ఇండియన్స్ కు గత ఐపీఎల్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. విదేశీ  ప్లేయర్లు అందరూ అందుబాటులోకి వచ్చారు. ఇక చెన్నైకి మాత్రం ఆస్ట్రేలియన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ప్లేయర్లు రాలేదు. దీంతో కొంత మైనస్ గా మారింది.  డుప్లెసిస్, సామ్ కరన్ లు లేకపోవడం పెద్దలోటుగా చెబుతున్నారు.