Mani Ratnam’s Ponniyin Selvan: క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) ప్రస్తుతం చేస్తున్న సినిమా “పొన్నియన్ సెల్వన్”( Ponniyin Selvan). కాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది. నిన్నే గుమ్మడి కాయ కొట్టారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన వర్క్ మరో మూడు నెలల్లో పూర్తి కానుంది. కాకపోతే, సినిమాని వచ్చే వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా కథ.. రాజులు, యుద్ధాల నేపథ్యంలో సాగే కథ కావడంతో సినిమాలో అత్యున్నత భారీ తారాగణం నటిస్తోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే, అందరిలో కల్లా… ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) పాత్ర కీలకం.
ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ మహారాణి పాత్రలో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె లుక్ కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ లుక్ లో ఐశ్వర్య రాయ్ నిజంగా మహారాణీలానే ఉంది. ఇక మణిరత్నం ఈ సినిమా తర్వాత ఇక డైరెక్షన్ చెయ్యడు అని, దర్శకత్వం పక్కన పెట్టి, నిర్మాతగా మారాలని మణిరత్నం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడని టాక్.
తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ మణిరత్నం సినిమాలను నిర్మించాలనుకుంటున్నారు. కాకపోతే అవి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సంస్థలకు మాత్రమే మణిరత్నం సినిమాలు చేస్తాడట. అంటే.. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. తనకు నష్టాలు లేకుండా ఉండాలని మణిరత్నం ఆలోచన.
ఇక ఈ “పొన్నియన్ సెల్వన్” సినిమా కథ విషయానికి వస్తే.. తమిళనాట బాగా ప్రాచుర్యం ఉన్న చోళులకు సంబంధించిన ఓ నవల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.