Dhoni Jersey: ధోని ధరించే జెర్సీ నెంబర్ వెనుక ఇంతటి స్టోరీ దాగుందా?

మైదానంలో ఉన్నప్పుడు ధోని ఏడవ నెంబర్ జెర్సీ ధరించి కనిపించేవాడు. అదృష్టాన్ని అంతగా నమ్మని జెర్సీ విషయంలో మాత్రం ఒక నమ్మకంతో ఉండేవాడు.

Written By: Suresh, Updated On : February 13, 2024 8:24 am

Dhoni Jersey

Follow us on

Dhoni Jersey: “భౌతిక శాస్త్రంలో ధ్వని వేగం, కాంతి వేగం అనే కొలమానాలు ఉంటాయి. ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు అవి రెండు కూడా వెనకబడే ఉంటాయి..” ధోని ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను స్టంప్ ఔట్ లేదా రన్ ఔట్ చేసినప్పుడు బాక్స్ లో ఉన్న కామెంటేటర్లు విసిరే చలోక్తులవి. వారి చలోక్తుల మాదిరిగానే ధోని కీపింగ్ ఉంటుంది. వికెట్ల వెనుక అతడు ఒక అడ్డుగోడ లాగ నిలబడతాడు. పరుగులు తీయకుండా అడ్డుకుంటాడు. ఆటపై అంతటి మక్కువ ఉంది కాబట్టే భారత జట్టుకు కపిల్ దేవ్ తర్వాత వరల్డ్ కప్ అందించాడు. టీ_20 కప్ ప్రవేశపెట్టిన తొలి సంవత్సరంలోనే భారత్ గెలుచుకునేలా చేసాడు.. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.. అలాంటి ధోని ఏం చేసినా స్పెషలే. చివరికి అతను ధరించే జెర్సీ తో సహా..

మైదానంలో ఉన్నప్పుడు ధోని ఏడవ నెంబర్ జెర్సీ ధరించి కనిపించేవాడు. అదృష్టాన్ని అంతగా నమ్మని జెర్సీ విషయంలో మాత్రం ఒక నమ్మకంతో ఉండేవాడు. దీనిపై పలు సందర్భాల్లో విలేకరులు ప్రశ్నించినప్పుడు ధోని అత్యంత సున్నితంగా ఆ ప్రశ్నను దాటవేసేవాడు. కానీ ఓ ప్రమోషన్ ఈవెంట్లో ధోని ధరించే జెర్సీ నెంబర్ పై ప్రశ్న ఎదురయింది..” నేను భూమి పైకి రావాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఆరోజు జూలై 7, 1981న నేను పుట్టాను.. 8-1=7.., పుట్టిన తేదీ 7.. కాబట్టి నాకు ఏడు అంటే ఇష్టం” అని మహేంద్ర సింగ్ ధోని తన జెర్సీ వెనుక అసలు సీక్రెట్ చెప్పాడు. ఆ ఏడవ నెంబర్ జెర్సీ ధరించి ధోని భారత జట్టుకు ఘనమైన విజయాలను అందించాడు. ధోని అంతర్జాతీయ కెరీర్ ముగిసిన తర్వాత ఏడవ నెంబర్ జెర్సీని బీసీసీఐ రిటైర్ చేసింది. ఒకవేళ ఆ తేదీన పుట్టిన ఆటగాళ్లు.. ఎవరైనా ఆ నెంబర్ జెర్సీ కావాలంటే ఇకపై కష్టమే.

కేవలం మహేంద్రసింగ్ ధోని కి మాత్రమే కాదు కొంతమంది క్రీడాకారులకు కూడా ఇలాంటి ఇష్టమే ఉంది.. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధర్ టెస్టుల్లో ఎనిమిది వందల వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత తన జెర్సీ నెంబర్ 800 గా మార్చుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించే నాటికి అదే నెంబర్ కలిగి ఉన్న జెర్సీని ధరించేవాడు. ఇక వెస్టిండీస్ సంచలనం క్రిస్ గేల్ కూడా 333 నెంబర్ కలిగివున్న జెర్సీ ధరించేవాడు..అతడు టీ_20 బ్యాట్స్ మెన్ ఐనప్పటికీ.. టెస్ట్ మ్యాచ్ లలో 333 స్కోర్ చేశాడు. అది అతడికి అత్యధిక స్కోర్ కావడంతో.. అదే నెంబర్ కలిగి ఉన్న జెర్సీ ధరించేవాడు. అయితే ఈ జెర్సీలను అటు శ్రీలంక బోర్డు, ఇటు వెస్టిండీస్ బోర్డు రిటైర్ చేయలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఏడవ నెంబర్ జెర్సీని ధోని కోసం రిటైర్ చేసింది.