Will Jacks: విల్ జాక్స్.. ఐపీఎల్ లో ఇతడు ఇంతవరకు ఆడలేదు కానీ.. ఇంగ్లాండ్ క్రికెట్లో ఒక సంచలనం. వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతున్న బెంగళూరు జట్టు ఇతడిని 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇంతవరకు ఇతడికి ఆడే అవకాశాన్ని కల్పించలేదు. బెంగళూరు జట్టులో వరుసగా విఫలమవుతున్న గ్రీన్, మ్యాక్స్ వెల్ లో ఎవరో ఒకరిని పక్కన పెట్టి జాక్స్ ను ఆడిస్తే ఉపయోగం ఉంటుందని ఎప్పటినుంచో అభిమానులు కోరుతున్నారు అయినప్పటికీ బెంగళూరు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఇంగ్లాండ్ జట్టులో జాక్స్ టెస్ట్, వన్డే, టి20 ఇలా మూడు ఫార్మాట్లలో ఆడాడు. ముఖ్యంగా ఇతడికి డొమెస్టిక్, ఫ్రాంచైజీ క్రికెట్లో తిరుగులేని రికార్డులు ఉన్నాయి.. టి20 అంటే చాలు జాక్స్ తాండవం చేస్తాడు. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు అతడు 157 మ్యాచ్ లు ఆడాడు. 30 యావరేజ్ తో 4వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా మూడు శతకాలు ఉన్నాయి. బ్యాటింగ్ మాత్రమే కాదు స్పిన్ బౌలింగ్ లోనూ జాక్స్ అదరగొడతాడు. మైదానంలో ఆట మాత్రమే కాదు.. మైదానం వెలుపల ప్రేమాయణం నడుపుతూ విల్ జాక్స్ ఇంగ్లీష్ మీడియాలో తరచూ చర్చకు వస్తాడు. తన ప్రేయసితో విహారం చేస్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాడు.
విల్ జాక్స్.. లండన్ కు చెందిన 24 సంవత్సరాల అనా బ్రమ్ వేల్ తో ప్రేమలో ఉన్నాడు. గత కొంతకాలంగా ఈ జంట లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. అనా.. బ్రిస్టల్ యూనివర్సిటీలో బయో మెడికల్ సైన్స్ డిగ్రీ చదువుతోంది.. పేద పిల్లలకు చదువు చెప్పే పిలిప్పిన్స్ కు చెందిన ఓ ఎన్జీవో లో కార్యకర్త కూడా. అనా ప్రయాణాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తుంది. సాహస యాత్రలు అంటే ఇష్టపడుతుంది. తన ప్రేమికుడు విల్ జాక్స్ తో కలిసి ప్రపంచంలోని పలు ప్రాంతాలను సందర్శించింది. జలపాతాలు, అరణ్యాలు, ఇతర దర్శనీయ ప్రాంతాలను ఈ జంట చుట్టి వచ్చింది. ఇటీవల విల్ జాక్స్, అనా దక్షిణాఫ్రికాలో పర్యటించారు. కేప్ టౌన్ ప్రాంతాన్ని కలియతిరిగారు. అక్కడ జలపాతాల్లో మునిగితేలారు.. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో అప్లోడ్ చేశారు.
లివ్ ఇన్ రిలేషన్ అంటే నచ్చినన్ని రోజులు కలిసి ఉండటం.. తర్వాత కటీఫ్ చెప్పుకోవడం.. కానీ జాక్స్, అనా వారి బంధం పై స్పష్టతతో ఉన్నారు.. వారిద్దరూ తమ అనుబంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.. అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలని కలలు కంటున్నారు. వారి ఆప్యాయత, వారి మధ్య ఉన్న అనురాగం ఆ బంధాన్ని మరింత బలపరుస్తోంది. సాంగత్యాన్ని మరింత ఫరిడవిల్లేలా చేస్తోంది. అయితే వీరిద్దరికీ పిల్లలు ఉన్నారని ఆమధ్య ఇంగ్లీష్ మీడియం కోడై కూసింది. ఆ తర్వాత అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే తమ మధ్య ఉన్న బంధాన్ని వ్యక్తీకరించడంలో.. ప్రదర్శించడంలో జాక్స్, అనా ఎటువంటి గోప్యత పాటించడం లేదు. పైగా వారి రొమాంటిక్ జర్నీని ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నారు. ఇద్దరికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన పదులకొద్దీ ఫొటోలే అందుకు ప్రబల ఉదాహరణ.