Kashvee Goutham: కానీ ఎప్పుడైతే ఆమె క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే పరిస్థితి మారిపోయింది. మొత్తంగా ఆమెలో ఉన్న క్రీడా దాహాన్ని క్రికెట్ తీర్చింది. ఆమె కూడా తీవ్రంగా కష్టపడి అద్భుతమైన క్రికెటర్ అయింది.. 22 ఏళ్ల వయసులో సరికొత్త శిఖరాలను అధిరోహించడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నది. ఇంతకీ ఆమె పేరు ఏంటంటే. కాశ్వీ గౌతమ్( kashvee Goutham).. కాశ్వీ గౌతమ్ తండ్రి వ్యాపారి. తల్లి గృహిణి. తొలి రోజుల్లో కాశ్వీ గౌతమ్ అబ్బాయిలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడేది.. క్రికెట్లో నైపుణ్యం సాధించడానికి ఉదయం 5 గంటలకే నిద్ర లేచేది. ఆ సమయంలో చండీగఢ్ ప్రాంతంలో మహిళా క్రికెట్ అకాడమీ లేకపోయినప్పటికీ.. కోచ్ నగేష్ గుప్తా తో కలిసి తన అభిరుచిని పంచుకుంది. అయితే ఆయన ఆమెలో ఉన్న ప్రతిమను గుర్తించి.. 2017లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడిచే క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అయితే ఆమె తన నివాసాన్ని చండీగఢ్ కు మార్చుకుంది. ఆమెలో ఉన్న ప్రతిభను అంతకంతకు పెంచుకుంది. సామర్ధ్యాన్ని మరింత విస్తరించుకుంది. ఫలితంగా అద్భుతమైన వర్ధమాన క్రికెటర్ గా ఎదిగింది. ఆమెలో ఉన్న ప్రతిభను చూసి గత ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో గుజరాత్ జట్టు రెండు కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా అత్యంత ఖరీదైన అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆమె నిలిచింది. అనుకోకుండా జరిగిన గాయం వల్ల ఆమె గత సీజన్లో ఆడలేకపోయింది. ఆమె స్థానంలో గుజరాత్ జట్టు ముంబైకి చెందిన సయాలి సత్ గారే ను ఎంపిక చేసుకుంది.
గత సీజన్ కు దూరమైన తర్వాత..
గత సీజన్ కు దూరమైన తర్వాత కాశ్వీ గౌతమ్ తన ఆటను మెరుగుపరచుకోవడానికి తీవ్రంగా కృషి చేసింది. తన రేంజ్ హిట్టింగ్ కు మరింత బాధని పెట్టింది.. భారీగా పరుగులు చేయడం, వికెట్ల మధ్యలో పరిగెత్తడం.. పదునైన బంతులను వేటాడడం..షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడం వంటి వాటిపై తీవ్రంగా శిక్షణ తీసుకుంది. స్కోరింగ్ అవకాశాలను కూడా మెరుగుపరుచుకుంది.. తన బౌలింగ్ వైవిధ్యానికి మరింత పదును పెట్టుకుంది. అయితే డొమెస్టిక్ క్రికెట్లో ఆమె అద్భుతమైన ఫలితాలు సాధించింది. మెరుగైన సగటును కొనసాగించింది. ఫలితంగా భవిష్యత్తు క్రికెట్ పై మరింత దృష్టి సారించింది. పవర్ ప్లే లో ఎక్కువ వికెట్లు తీయడం.. ఎకనామి రేటును తగ్గించుకోవడం.. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును విజయ పథంలో నడిపించడం వంటి వాటిపై దృష్టి సారించింది. అయితే ఇంతటి తీవ్ర కసరత్తులో కాశ్వీ గౌతమ్ కు ఆమె కుటుంబం అండగా నిలిచింది. కాశ్వీ గౌతమ్ కు వారు నిరంతరం ప్రేరణ అందించారు. విజయం సాధించేలాగా తోడ్పాటు అందించారు.. అందువల్లే ప్రస్తుత గుజరాత్ జట్టులో అద్భుతమైన ప్లేయర్ గా కాశ్వీ గౌతమ్ పేరొందింది. అయితే హార్దిక్ పాండ్యా నుంచి కాశ్వీ గౌతమ్ స్పూర్తి పొందింది. అందువల్లే ఆమె బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తోంది. చివరికి హార్దిక్ పాండ్యా వేసుకున్న టాటూ లను కూడా
కాశ్వీ గౌతమ్ వేసుకుందంటే అతడి నుంచి ఆమె ఎంతలా స్ఫూర్తి పొందిందో అర్థం చేసుకోవచ్చు.. డబ్ల్యూ పి ఎల్ మాత్రమే కాదు.. జాతీయ జట్టులోకి ఎంపికవడానికి కాశ్వీ గౌతమ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.