Dulip Trophy 2024: తొలి రౌండ్ లో ఇండియా – ఏ జట్టుపై ఇండియా – బీ జట్టు విజయం సాధించింది.. ఇండియా – డీ జట్టుపై ఇండియా – సీ జట్టు గెలుపును సొంతం చేసుకుంది. మరోవైపు వైట్ బాల్ లో స్టార్ క్రికెటర్లుగా పేరుపొందిన సంజు సాంసంన్, రింకు సింగ్ రెడ్ బాల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న ఇండియా – డీ జట్టులోకి సంజు వచ్చేసాడు. అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహిస్తున్న ఇండియా – బీ జట్టులోకి రింకూ సింగ్ కు అవకాశం లభించింది. ఇండియా – ఏ జట్టులోకి తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఈ జట్టుకు మయాంక్ అగర్వాల్ సారధ్యం వహిస్తున్నాడు.
ఇండియా – బీ జట్టు అభిమన్యు ఈశ్వరన్ టాస్ గెలిచి ఇండియా – సీ జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ రెండు జట్లు మొదటి రౌండ్లో విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇండియా – సీ జట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ కు గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. రుతు రాజ్ గైక్వాడ్ ఐపీఎల్ లో చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2024 సీజన్లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతు రాజ్ గైక్వాడ్ కు అవకాశం ఇచ్చాడు. రుతు రాజ్ గైక్వాడ్ చెన్నై జట్టును ముందుండి నడిపించినప్పటికీ.. 2024 సీజన్లో విజేతగా నిలపలేకపోయాడు..ఇక బంగ్లా సిరీస్ కు రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ కు జాతీయ జట్టులోకి అవకాశం లభించింది. ఇక మొదటి రౌండ్ మ్యాచ్ లో ముషీర్ ఖాన్ హీరోగా నిలిచాడు. అతడి సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సర్పరాజ్ ఖాన్ కు జాతీయ జట్టులోకి అవకాశం లభించినప్పటికీ.. అతడు రెండవ రౌండ్ మ్యాచ్ ఆడుతున్నాడు.
జట్ల వివరాలు ఇవీ
ఇండియా ఏ: జట్టు
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), అకిబ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ప్రసిద్ కృష్ణ, షామ్స్ ములాన్, కుమార్ కుషాగ్ర, ప్రథమ్ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రావత్, తనుష్
ఇండియా: బీ జట్టు
అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), ముషీర్ ఖాన్, జగదీషన్, రింకూ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ రెడ్డి, సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ముఖేష్ కుమార్, నవదీప్ షైనీ.
ఇండియా: సీ జట్టు
రుతు రాజ్ గైక్వాడ్(కెప్టెన్), సాయి సుదర్శన్, ఇషాన్ కిషన్, రజత్ పాటిదార్, ఇంద్రజిత్, అభిషేక్, మానవ్, అన్షుల్, మయాంక మార్కండే, విజయ్ కుమార్ వైశాఖ్, సందీప్ వారియర్.
ఇండియా డీ జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), యశ్ దూబే, అధర్వ, దేవదత్, సంజు, రికి భూయ్, సారాన్ష్, సౌరభ్ కుమార్, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, విద్వత్ కావెరప్ప.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More