Devara: హీరోలను అభిమానులు దేవుడు కంటే మిన్నగా భావిస్తారు. తమ హీరో పుట్టిన రోజు వేడుకలను సొంత ఖర్చులతో ఘనంగా నిర్వహిస్తారు. అన్నదానం, రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. ఇక సదరు హీరో మూవీ రిలీజ్ అంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. థియేటర్స్ ని అలంకరించి భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేస్తారు. హీరోలకు గుడులు కట్టించి పూజించిన అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి ఓ వీరాభిమాని చివరి రోజుల్లో తన కోరిక తీర్చమని వేడుకుంటున్నాడు.
దేవర మూవీ చూసి చనిపోతాను… అప్పటి వరకు బ్రతికించండని ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఏపీ ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్ ని వేడుకున్నాడు. 19 ఏళ్ల కౌశిక్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో బెంగుళూరులో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. తాను బ్రతికేది కొద్దిరోజులే అని తెలుసుకున్న కౌశిక్ దేవర మూవీ చూడకుండానే మరణిస్తానని ఆందోళనకు గురవుతున్నాడు.
దేవర మూవీ చూడాలని ఉంది. కనీసం అప్పటి వరకు నన్ను బ్రతికించండి అని వేడుకున్నాడు. కౌశిక్ కోరికను తల్లిదండ్రులు మీడియా వేదికగా తెలియజేశారు. తన కొడుకు చివరి కోరిక తీర్చాలని కన్నీరు మున్నీరు అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో ఎన్టీఆర్ చొరవ తీసుకుని, కౌశిక్ కోరిక నెరవేర్చాలని తెలియజేశారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరి కౌశిక్ కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. దేవర మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని భాషల్లో కలిపి దేవర ట్రైలర్ 24 గంటల్లో 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది.
దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని తెరకెక్కించాడు. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధా ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. దేవర పై ఇండియా వైడ్ అంచనాలున్నాయి.
బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న #NTR అభిమాని రిక్వెస్ట్#Devara సినిమా చూసే వరకు నన్ను బతికించండి pic.twitter.com/kXmxJMheAf
— CHITRAMBHALARE (@chitrambhalareI) September 12, 2024
Web Title: If you die watching devara movie ntr fan wish goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com