INDw vs BANw : టీమిండియా మహిళల క్రికెట్ జట్టు చెలరేగిపోయింది. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మహిళల జట్టు తొలి టీ20 లో ఘన విజయం సాధించింది. అయితే, గతానికి భిన్నంగా భారత మహిళల జట్టు తొలి మ్యాచ్ లో గొప్ప ప్రదర్శనతో అలరించింది. బంగ్లాదేశ్ విధించిన లక్ష్యాన్ని మరో 22 బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు మూడు వికెట్లు నష్టపోయి ఘన విజయం సాధించింది. అయితే, మహిళల జట్టు ఆడిన ఆట తీరును చూసిన అభిమానులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతానికి భిన్నంగా మహిళలు జట్టు సానుకూలంతో ఆడి అభిమానులను అలరించింది.
బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. తొలి టి20 లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గతానికి భిన్నంగా మహిళలు జట్టు బంగ్లాదేశ్ తో తొలి టి20 మ్యాచ్ లో ఆడిన తీరు అభిమానులను ఎంతగానో అలరించింది. సానుకూల దృక్పథంతో భారత జట్టు మ్యాచ్ ఆద్యంతం కనిపించింది. తొలుత బౌలింగ్ లో బంగ్లాదేశ్ జట్టును 114 పరుగులకు కట్టడి చేయడం ద్వారా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. పూజా వస్త్రాకర్, అమన్ జ్యోత్ కౌర్, మిన్ను మనీ, సఫారీ వర్మ అద్భుతమైన బౌలింగ్ తో ఒక్కో వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ ను పరుగులు చేయకుండా కట్టడి చేయగలిగారు. స్వల్ప లక్ష్య ఛేదనలోనూ భారత మహిళా జట్టు ప్లేయర్లు సానుకూల దృక్పథంతో ఆడే విజయం సాధించారు. స్మృతి మందాన 34 బంతుల్లో 38 పరుగులు, కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టుకు సులభంగా విజయాన్ని అందించి పెట్టారు.
స్పష్టంగా కనిపిస్తున్న మార్పు..
భారత మహిళల జట్టులో గతానికి భిన్నమైన ఆట తీరు కనిపిస్తోంది. ఒత్తిడికి దూరంగా ద్వారా మ్యాచ్ ను భారత మహిళా ప్లేయర్లు ఏకపక్షంగా పూర్తి చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రదర్శన పూర్తిగా మెరుగుపడింది. ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు పట్టు కొనసాగించారు. దీంతో ఏ దశలో బంగ్లాదేశ్ జట్టు పోటీలోకి రాలేకపోయింది. భారత మహిళల జట్టులోని కీలక ప్లేయర్లుగా ఉన్న స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడంతో భారత జట్టు సులభంగా విజయం సాధించింది. వీరిద్దరూ కూడా మంచి బంతులను క్షమించడం ద్వారా అనవసరంగా వికెట్ పారేసుకోకుండా బ్యాటింగ్ చేయగలిగారు. గతంలో అనేకసార్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈ మ్యాచ్ లో మాత్రం అటువంటి తప్పిదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. చెడ్డ బంతులను బౌండరీలకు తరలించి పరుగులు రాబట్టారు. మంచి బంతులు వేసినప్పుడు మాత్రం బౌలర్లకు గౌరవాన్ని ఇచ్చారు. ఈ విధంగా చేయడం ద్వారా మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించారు. జట్టు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలన్న వ్యూహంలో భాగంగానే బంగ్లాదేశ్ పై తొలి టీ20 మ్యాచ్ లో భారత మహిళలు జట్టు విజయం సాధించిందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.