https://oktelugu.com/

World Test Championship : కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ కు గురైన తర్వాత.. డబ్ల్యూటీసీ టేబుల్ లో భారత్ పరిస్థితి ఏంటంటే?

స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా దారుణమైన ఓటమికి గురైంది. మూడు టెస్టుల సిరీస్ లో 0-3 తేడాతో వైట్ వాష్ బారిన పడింది. టీమిండియా ఘోరంగా ఓడిపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 3, 2024 4:10 pm
    World Test Championship

    World Test Championship

    Follow us on

    World Test Championship  : న్యూజిలాండ్ జట్టు చేతిలో వైట్ వాష్ కు గురికావడంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవడంపై సందిగ్ధం నెలకొంది.. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన నేపథ్యంలో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కోల్పోయింది. రెండవ స్థానానికి దిగజారింది. ఆస్ట్రేలియా జట్టు 62.50% పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకుంది. టీమిండియా 58.33% పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయింది. 55.56 శాతం పాయింట్లతో శ్రీలంక మూడో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 54.55 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా 54.1 శాతంతో ఐదవ స్థానంలో ఉంది.

    కఠిన సవాల్

    త్వరలో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. డబ్ల్యూటీసీ సైకిల్ లో భాగంగా ఇది టీమిండియా కు చివరి సిరీస్. ఆస్ట్రేలియాతో టీమిండియా మొత్తం ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. నాలుగు మ్యాచ్ లు గెలవడంతోపాటు.. మరో మ్యాచ్ డ్రా గా ముగించుకోవాలి. అయితేనే టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ లో ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఫైనల్ అవకాశం అత్యంత సంక్లిష్టంగా మారుతుంది.

    24 సంవత్సరాల అనంతరం..

    భారత జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ ను న్యూజిలాండ్ 3-0 తేడాతో దక్కించుకుంది. బెంగళూరులో జరిగిన తొలి మ్యాచ్ ను న్యూజిలాండ్ ఎనిమిది టికెట్ల తేడాతో గెలుచుకుంది. పూణే వేదికగా జరిగిన రెండవ మ్యాచ్ లో 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడవ మ్యాచ్ ను 25 పరుగుల తేడాతో గెలిచింది.. భారత జట్టు 92 సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్ ఆడుతోంది. కానీ స్వదేశంలో 3-0 తేడాతో ఎప్పుడూ టెస్ట్ సిరీస్ ఓటమిన్ ఎదుర్కోలేదు. కానీ ఈసారి స్వదేశంలో భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ తొలిసారిగా రికార్డు సృష్టించింది. 1958లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ 3-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. అయితే అది 5 మ్యాచ్ సిరీస్. అయితే అందులో మిగతా రెండు మ్యాచ్ లు డ్రా గా ముగియడం విశేషం… భారత జట్టు 92 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. 24 సంవత్సరాల తర్వాత స్వదేశంలో వైట్ వాష్ కు గురైంది. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో టీమిండియా వైట్ వాష్ కు గురైంది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత జట్టును దారుణంగా ఓడించింది. స్వదేశంలో వైట్ వాష్ చేసేసింది.. ఇక నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుంది.. అయితే ఈ సిరీస్ ద్వారానైనా టీమిండియా బౌన్స్ బ్యాక్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.