Ind Vs Nz 1st Test: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇండియా మొదటి బ్యాటింగ్ చేసి దారుణంగా ఫెయిల్ అయింది .కేవలం 46 పరుగులకే ఆల్ అవుట్ అయింది . ఇది ఇండియన్ టీమ్ కి చాలా దారుణమైన పరిణామం అని చెప్పాలి.ఒక రకంగా చెప్పలంటే ఇండియా ఒక బ్యాడ్ రికార్డును తన పేరు మిద నమోదు చేసుకుంది. రిషాబ్ పంట్ 20, జేశ్వల్ 13 వీళ్ళను మినహాయిస్తే మిగిలిన వారెవరు కూడా రెండు అంకెల స్కోర్ చేయలెకపోవడం అనేది నిజంగా చాలా చెడ్డ విషయం అని చెప్పాలి. న్యూజీలాండ్ బౌలర్లు ఈ మ్యాచ్లో చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు .ముఖ్యంగా మన బ్యాట్స్మెన్ ని చకచక్యంగా బురుడి కొట్టించారు.మనవాళ్ళు పెవిలియన్ కి పంపించడంలో వాళ్లు చాలా చక్కటి నైపుణ్యం నీ ప్రదర్శించారు.ఇప్పటి వరకు ఎన్నాడు లేని విధంగా ఇంత తక్కువ స్కోరుకి ఆల్ అవుట్ అవ్వడం చాలా దారుణం అని చెప్పాలి.
ఈ మధ్యకాలంలో ఇండియన్ టెస్టుల్లో ఇంత దారుణమైన పర్ఫామెన్స్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఇక ఈ ఫెయిల్యూర్ కి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇండియన్ టీం కోచ్ ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అయితే ఇండియన్ టీమ్ కి టెస్టుల్లో భారీ రికార్డు అయితే ఉంది. అన్ని జట్ల కంటే ప్రస్తుతం ముందంజలో ఉంది. ప్రస్తుతం ఇండియన్ టీం ఈ మ్యాచ్లో గెలవాలి అంటే న్యూజిలాండ్ టీం ను కూడా చాలా తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
అలా కాకుండా వాళ్ళు కనుక భారీ స్కోర్ చేసినట్టయితే ఇక ఈ మ్యాచ్ మీద మన ప్లేయర్లు ఆశలు వదిలేసుకోవాల్సిందే . కాబట్టి ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవాలి అంటే ఇండియన్ బౌలర్లు రాణించాల్సిన అవసరమైతే ఉంది. మన ఇండియన్ టీం రీసెంట్ గా బంగ్లాదేశ్ మీద భారీ విక్టరీని సాధించారు. ఇప్పుడు వీళ్ళ మీద ఎదురుదెబ్బ తగలబోతోందా అని స్పోర్ట్స్ విశ్లేషకులు సైతo భావిస్తున్నారు .మొత్తానికైతే న్యూజిలాండ్ టీం ను బురిడీ కొట్టించానంటే మన బౌలర్లు చాలా దృఢ సంకల్పంతో బౌలింగ్ చేయాల్సిన అవసరమైతే ఉంది.
ఇంతకుముందు ఇలాంటి సందర్భాలు ఎదురైన సమయాల్లో మన బౌలర్లు చాలా చాకచక్యంగా వ్యవహరించి మొత్తం మ్యాచ్ని ఇండియన్ టీం వైపు తిప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మన బౌలర్లు వాళ్ళ బ్యాట్స్మెన్ట్స్ కి సరైన సమాధానం చెప్పాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మొత్తానికైతే క్ పాట్ హెన్ట్రీ 5 వికట్టు తీయగా, విలియమ్స్ నాలుగు వికెట్లు తీశాడు సౌదీ ఒక వికెట్ తో సరి పెట్టుకున్నాడు.