https://oktelugu.com/

Top Salling Cars : ప్రస్తుతం అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్నా టాప్ 7 కార్లు ఇవే..

కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఎస్ యూవీల ఉత్పత్తిపైనే ఫోకస్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ యూవీల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇటీవల కాలంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా విక్రయాలు జరుపుుకంటున్న టాప్ 7 కార్లు ఏవో చూద్దాం..

Written By:
  • Srinivas
  • , Updated On : October 17, 2024 / 03:15 PM IST

    Top Salling Cars

    Follow us on

    Top Salling Cars : కార్యాలయ అవసరాలు, విహార యాత్రలకు వెళ్లడానికి నేటి కాలంలో చాలా మంది సొంత కారును కలిగి ఉంటున్నారు. కరోనా తరువాత సొంతంగా వెహికల్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే సెడాన్ నుంచి ఎస్ యూవీ వరకు వేరియంట్లు ఉన్ మార్కెట్లో ఎక్కువగా కాంపాక్ట్ ఎస్ యూవీ, ఎస్ యూవీలపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇవి మిగతా వాటి కంటే ఎక్కువ సేల్స్ నమోదు చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఎస్ యూవీల ఉత్పత్తిపైనే ఫోకస్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ యూవీల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇటీవల కాలంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా విక్రయాలు జరుపుుకంటున్న టాప్ 7 కార్లు ఏవో చూద్దాం..

    ఆటోమోబైల్ రంగ వ్యాప్తంగా సెప్టెంబర్ విక్రయాల వివరాలను కార్ల కంపెనీలు బయటపెట్టాయి. ఈ నెలలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా 2024 సెప్టెంబర్ లో అమ్మాకాలు పెరిగాయి. ఈ నెలలో మొత్తం ఈ మోడల్ ను 15, 902 మంది సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఇదే నెలలో దీనిని 12,717 మంది మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో ఈ మోడల్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ కారు తరువాత మారుతి కి చెందిన బ్రెజా ఎస్ యూవీ రెండో స్థానంలో నిలిచింది. దీని విక్రయాలు సెప్టెంబర్ లో 15,222 గా నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్ లో బ్రెజాను 15,001 కొనుగోలు చేశారు.

    ఎస్ యూవీల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన స్కార్పియో 16,388 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. దీనిని గత ఏడాదిలో 11,849 మంది సొంతం చేసుకున్నారు. మారుతికి చెందిన మరో ఎస్ యూవీ ఫ్రాంక్స్ అమ్మకాల్లో వృద్ధి సాధించింది. 2024 ఏడాది సెప్టెంబర్ లో దీనిని 13,874 మంది కొనుగోలు చేశారు. 2023 సెప్టెంబర్ లో 11,455 మంది కొనుగోలు చేశారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఈ మోడల్ 21 శాతం వృద్ధి సాధించింది.

    దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తున్న కార్లలో టాటా పంచ్ ఒకటి. టాటా పంచ్ ను 2023 ఏడాది సెప్టెంబర్ లో 13,036 మంది కొనుగోలు చేయగా.. 2024 ఏడాది అదే నెలలో దీనిని 13,711 కార్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది కంటే ఈ మోడల్ అమ్మకాల్లో 5 శాతం వృద్ది సాధించింది. ఆ తరువాత టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ కారు గత ఏడాది సెప్టెంబర్ లో 11,470 మంది కొనుగోలు చేయగా.. ఈ ఏడాది సెప్టెంబర్ లో 15,325 సొంతం చేసుకున్నారు. టాప్ 7లో కియా కంపెనీకి చెందిన సోనెట్ కారు నిలిచింది. ఈ కారును 2024 ఏడాదిలో 10,335 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదిలో దీనిని 4984 యూనిట్లు అమ్ముడు పోయాయి. మొత్తంగా సెప్టెంబర్ నెలలో ఎస్ యూవీల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.