‘కాంస్య’ వీరుడు.. మన ‘భజరంగు’డు?

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ‘కాంస్యం’ల పంట పండుతోంది. సహజంగా అందరూ స్వర్ణం గెలవాలని ఆశపడుతుంటే మన భారత క్రీడాకారులకు సెమీస్ గండం దాటలేకపోతున్నారు. అయితే రజతం లేదంటే కాంస్యంతోనే ఇంటిదారి పడుతున్న పరిస్థితి నెలకొంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం సాధించిపెట్టాడు కుస్తీవీరుడు. భారత రెజ్లర్ భజరంగ్ పూనియా అద్భుతమే చేశాడు. పురుషుల 65 కిలోల కుస్తీ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. కజకిస్తాన్ కు చెందిన దౌలత్ నియజ్ బెకోవ్ ను […]

Written By: NARESH, Updated On : August 8, 2021 12:15 pm
Follow us on

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ‘కాంస్యం’ల పంట పండుతోంది. సహజంగా అందరూ స్వర్ణం గెలవాలని ఆశపడుతుంటే మన భారత క్రీడాకారులకు సెమీస్ గండం దాటలేకపోతున్నారు. అయితే రజతం లేదంటే కాంస్యంతోనే ఇంటిదారి పడుతున్న పరిస్థితి నెలకొంది.

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం సాధించిపెట్టాడు కుస్తీవీరుడు. భారత రెజ్లర్ భజరంగ్ పూనియా అద్భుతమే చేశాడు. పురుషుల 65 కిలోల కుస్తీ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. కజకిస్తాన్ కు చెందిన దౌలత్ నియజ్ బెకోవ్ ను 8-0తో చిత్తు చేశాడు. ఈ పోరులో భజరంగ్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పోరాడాడు.

రక్షణాత్మకంగా ఆడుతూనే భజరంగ్ దూకుడు ప్రదర్శించాడు. ప్రత్యర్థికి తన కాళ్లు అందకుండా వ్యూహాత్మకంగా ఆడి గెలిచాడు. రెండో పీరియడ్ లో అయితే భజరంగ్ రెచ్చిపోయాడు. ప్రత్యర్థి కాళ్లను పట్టుకొని రింగు బయటకు నెట్టేశాడు. వరుసగా పాయింట్లు సాదించి తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు.

భజరంగ్ ధాటికి కజికిస్తాన్ ప్లేయర్ తట్టుకోలేకపోయాడు. దీంతో 8-0 తేడాతో విజయం సాధించాడు. అయితే 65 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన భజరంగ్ సెమీస్ లో చేసిన పొరపాట్లతో ఓడిపోయాడు. ఇప్పుడు కాంస్యం కోసం పోరులో గెలిచి భారత్ కు కాంస్యం అందించాడు.