ENG vs AUS : ఐసీసీ చైర్మన్ గా జై షా ఇప్పుడు ఉన్నప్పటికీ.. గతంలో పనిచేసిన ఐసీసీ చైర్మన్లు టీమ్ ఇండియా అంటే ప్రత్యేకంగా చూసేవారు.. ఎందుకంటే ఐసీసీకి వచ్చే సింహభాగం ఆదాయం టీమిండియా ద్వారానే లభిస్తోంది. టీమిండియా ఆడిన మ్యాచ్లకు గ్లోబల్ స్పాన్సర్లు క్యు కడుతుంటారు. ఉదాహరణకు ఐపీఎల్ నే తీసుకుంటే ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్ లు ఉన్నప్పటికీ.. కేవలం ఐపిఎల్ మాత్రమే రిచ్ క్రికెట్ లీగ్ గా రూపాంతరం చెందింది. ఏకంగా వేల కోట్లకు ఎదిగింది. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు జట్లను కొనుగోలు చేసి.. ఆడిస్తున్నాయి. ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ లో అంతకుమించి సంపాదిస్తున్నాయి. ఆటగాళ్లకు కూడా అదే స్థాయిలో సంపాదన లభిస్తోంది. ఆటగాళ్లు కూడా చాలామంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సంపాదించారు. అయితే ఇదంతా కూడా టీమిండియా ద్వారానే లభించింది.. టీమిండియా ద్వారా ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తున్న నేపథ్యంలో ఐసిసి కూడా తన స్వామి భక్తిని నిరూపించుకుంది. పైగా ఇప్పుడు ఐసీసీ చైర్మన్ గా జై షా కొనసాగుతున్నారు.
స్వామి భక్తిని ఇలా నిరూపించుకుంది
టీమిండి అంటే ఐసీసీకి మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. చైర్మన్ గా ఎవరు ఉన్నా సరే అందులో ఏమాత్రం లోటు లేదు.. అయితే ఐ సి పి చేసిన ఒక పని ఇప్పుడు టీమిండియా పేరు మరోసారి ప్రపంచ స్థాయిలో మార్మోగేలా చేసింది. లాహోర్ గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ (AUS vs ENG) శనివారం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 351 పరుగులు చేసింది. అయితే ఆ టార్గెట్ కాపాడుకోవడంలో విఫలమైంది. ఆస్ట్రేలియా మధ్య ఓవర్ల నుంచి చివరి ఓవర్ల దాకా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండు బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో ఇంగ్లాండ్ ఓటమి పాలు కాక తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా భారత జాతీయ గీతాన్ని నిర్వాహకులు ప్లే చేశారు. కొన్ని సెకండ్ల పాటు భారత జాతీయ గీతం వినిపించింది. దీంతో ఐసీసీ బాధ్యులు ఒక్కసారిగా నాలుక కరుచుకున్నారు. భారత జాతీయ గీతం వినిపించడంతో ఆస్ట్రేలియా అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా షాక్ చెందారు. ఆ తర్వాత గడాఫీ స్టేడియం నిర్వాహకులకు విషయం తెలియడంతో అప్రమత్తమయ్యారు. జనగణమన గీతాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని ప్లే చేయడం మొదలుపెట్టారు.. ఇక ఈ ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. పాకిస్తాన్లో భద్రత కారణాల వల్ల టీమిండియా దుబాయ్ వేదికగా తన మ్యాచులు ఆడుతోంది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో తలపడుతుంది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా పాకిస్తాన్(IND vs PAK) చేతిలో ఓటమిపాలైంది. ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా జనగణమన వినిపించడంతో టీమిండి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం లో ఇక్కడికి వెళ్లినా జనగణమన వినిపించాల్సిందేనని.. చివరికి పాకిస్తాన్లోనూ మన జాతీయ గీతం ప్రతిధ్వనించాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. మేరా భారత్ మహాన్.. ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి అంటూ పేర్కొంటున్నారు.
India National Anthem played in Pakistan … #INDvsPAK #AusvsEng #EngVsAus pic.twitter.com/ruoP4rDx0n
— Bunty Singh (@Bunty_Singh__) February 22, 2025
India National Anthem played in Pakistan … #INDvsPAK #AusvsEng #EngVsAus pic.twitter.com/ruoP4rDx0n
— Bunty Singh (@Bunty_Singh__) February 22, 2025