Ram Pothineni : వరుసగా మూడు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకొని, కెరీర్ పరంగా తీవ్రమైన గడ్డుకాలాన్ని ఎదురుకుంటున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) ప్రస్తుతం పి.మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు గతంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్ లో మిస్ శెట్టి..మిస్టర్ మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి డైరెక్టర్ తో రామ్ పోతినేని ఒక కొత్త కాన్సెప్ట్ తో చేస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే(Bhagyasri Bhorse) నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి లో జరుగుతుండగా, నిన్న జనసేన పార్టీ(Janasena Party) ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh) సెట్స్ లోకి అడుగుపెట్టి మూవీ టీం కి సర్ప్రైజ్ ఇచ్చాడు.
కాసేపు రామ్ పోతినేని తో, మూవీ టీం తో ఆయన సరదాగా ముచ్చటించారు. దానికి సంబంధించిన ఫోటోలను కందుల దుర్గేష్ నిన్న తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ ‘హీరో రామ్ ఎనర్జీ, డ్యాన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఒక్కోసారి రామ్ డ్యాన్స్ చూస్తే ఆయన శరీరం లో ఎముకలు ఉన్నాయా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. రబ్బరు స్ప్రింగ్ తరహాలో తన శరీరాన్నిఅద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో మౌల్డ్ చేస్తాడు. ఇప్పటి వరకు గోదావరి జిల్లాలో షూటింగ్ జరుపుకున్న సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ట్వీట్ కి హీరో రామ్ స్పందిస్తూ ‘దుర్గేష్ గారు..మిమ్మల్ని కలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. టూరిజం తో పాటు సినీ ఇండస్ట్రీ ని అభివృద్ధి చేసేవిధంగా మీరు చేసిన ఆలోచనలు నాకు ఎంతో గొప్పగా అనిపించాయి. రాజమండ్రి లో షూటింగ్ చేయడం ఒక అదృష్టం గా భావిస్తున్నాను. మాతో మీ విలువైన సమయాన్ని కేటాయించనందుకు ధన్యవాదాలు. సినీ పరిశ్రమకు మీరు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. తమ జనసేన పార్టీ ఎమ్మెల్యే ని అంతగా గౌరవించినందుకు రామ్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు. ఇకపోతే రామ్ గత చిత్రం డబుల్ ఇస్మార్ట్ కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇక నుండి ఆయన స్క్రిప్ట్ ఎంపిక విషయం ఆచి తూచి అడుగులు వేయనున్నాడు.
Dear Sir,
It was an honor to meet you on our sets. I sincerely appreciate your time & the opportunity to hear your visionary ideas for the development of AP’s tourism.Rajahmundry has indeed been lucky for me & filming here has been a breeze, thanks to you & the cooperation of… https://t.co/DBp6EDi6bz pic.twitter.com/m8ik8ljfZ6
— RAm POthineni (@ramsayz) February 22, 2025