https://oktelugu.com/

పబ్ జీకి పోటీగా భారతీయ ‘ఫౌ-జీ’

దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ‘పబ్ జీ’ గేమ్ ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిషేధించింది. మనదేశంపైకి దండెత్తి వస్తున్న చైనాకు బుద్ది చెప్పేందుకు ఆ దేశం రూపొందించిన పబ్ జీ గేమ్ సహా 118 యాప్ లపై దేశంలో భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. Also Read: బాలీవుడ్ లో హీరోయిన్లకే ఎక్కువ మగతనం : వర్మ ఆత్మనిర్భర భారత్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2020 / 07:20 PM IST
    Follow us on

    దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ‘పబ్ జీ’ గేమ్ ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిషేధించింది. మనదేశంపైకి దండెత్తి వస్తున్న చైనాకు బుద్ది చెప్పేందుకు ఆ దేశం రూపొందించిన పబ్ జీ గేమ్ సహా 118 యాప్ లపై దేశంలో భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.

    Also Read: బాలీవుడ్ లో హీరోయిన్లకే ఎక్కువ మగతనం : వర్మ

    ఆత్మనిర్భర భారత్ లో భాగంగా భారతీయులు రూపొందిస్తున్న అచ్చం పబ్ జీని పోలిన‘ఫౌజీ’ యాక్షన్ గేమ్ ను తీసుకొస్తున్నట్టు తాజాగా బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ ప్రకటించాడు.

    ‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ తాజాగా ‘ఫియర్ లెస్ అండ్ యూనైటెడ్: గార్డ్స్’ (ఫౌజీ) పేరుతో యాక్షన్ గేమ్ ను రూపొందించింది. హీరో అక్షయ్ కుమార్ నేతృత్వంలో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్ గురించి అక్షయ్ ట్వీట్ చేశాడు.

    Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ !

    ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమస్ఫూర్తితో ఫౌజీ గేమ్ ను సగర్వంగా ప్రకటిస్తున్నామని.. ఈ గేమ్ ఆడడం.. వినోదంతోపాటు మన సైనికుల త్యాగాల గురించి కూడా తెలుసుకుంటారని.. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20శాతం ‘భారత్ కా వీర్’ ట్రస్ట్ కు అందుతుందని అక్షయ్ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ గేమ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.