Pakistan Coach Mike Hesson: మంద బలం చూసుకుని కుక్కలు మొరుగుతుంటాయి. మంద దూరమైతే మొరగడం కాదు కదా కనీసం దగ్గరికి కూడా రావు. అయితే ఇది నిన్నటి వరకు కుక్కలకు మాత్రమే వర్తించేది. ఇప్పుడు పాకిస్తాన్ కు కోచ్ మైక్ హేసన్ కు వర్తించే విధంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఆసియా కప్ ప్రారంభానికి ముందు హేసన్ అడ్డగోలుగా మాట్లాడాడు. పాకిస్తాన్ అంటే దమ్మున్న జట్టు అని.. దాన్ని నిలువరించే స్థాయి ఏ జట్టుకూ లేదని కే జి ఎఫ్ లెవెల్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. పిచ్ ఎలాంటిదైనా సరే తాము దుమ్ము రేపుతామని.. స్పిన్ ట్రాక్ ఇస్తే మా వద్ద ప్రపంచ స్థాయిలోనే అద్భుతమైన బౌలర్ ఉన్నాడని వీర లెవెల్ లో మాట్లాడాడు. నవాజ్ దెబ్బకు ఎలాంటి జట్టు అయినా సరే తోక ముడుచాల్సిందేనని బీరాలు పలికాడు. పాకిస్తాన్ మీడియా అతని వ్యాఖ్యలకు విపరీతమైన ప్రాధాన్యమించింది. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అతడు చెప్పినట్టు ఏమీ లేదని.. పాకిస్తాన్ తన ముందు తోక జట్టని నిరూపించింది. ఆసియా కప్ లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ ఏకపక్ష ప్రదర్శన చేసింది. 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.. పాకిస్తాన్ కోచ్ చెప్పినట్టుగా ఆ జట్టు ఆటగాళ్లకు అంత సన్నివేశం లేదని బలంగా నిరూపించింది. అంతేకాదు గెలిచిన తర్వాత కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఇవన్నీ జరిగిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్ కోచ్ గురించి భారత అభిమానులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
హేసన్ పాకిస్తాన్ జట్టును చూసి ఎగిరి ఎగిరి పడుతున్నాడని.. ఇప్పటికైనా వాస్తవం అతనికి అర్థమై ఉంటుందని భారత అభిమానులు వ్యాఖ్యలు ఇస్తున్నారు.. ఈ జట్టును చూసి భారత బృందంతో కయ్యానికి కాలు దువ్వితే తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని భారత అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విమర్శలు చేసుకునే ముందు ఆత్మ విమర్శ గనుక చేసుకొని ఉంటే బాగుండేదని పేర్కొంటున్నారు. ఇలాంటి ఓవరాక్షన్ కనుక మరొకసారి చేస్తే ఐపీఎల్ లో కోచింగ్ చేసుకునే అవకాశం కూడా ఉండదని.. అడ్డగోలుగా మాట్లాడితే హసేన్ కు సినిమా 70mm లో కనిపిస్తుందని భారత అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. లేకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంటున్నారు. కాగా, మైక్ హేసన్ 2019 23 ఐపీఎల్ సీజన్లో బెంగళూరు జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. అతడి ఆధ్వర్యంలో ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోవడంతో బెంగళూరు యాజమాన్యం ఉద్వాసన పలికింది. దీంతో అతడు ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టు కనుక విఫలమైతే అతని పోస్టు ఊస్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. బెంగళూరు కంటే ముందు 2019లో పంజాబ్ జట్టుకు హేసన్ శిక్షకుడిగా వ్యవహరించాడు. భారత జట్టు మీద అడ్డగోలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో అతడిని మళ్లీ ఐపీఎల్లోకి తీసుకోకూడదని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తున్నారు.