https://oktelugu.com/

ఈ వీక్ టాలీవుడ్ ట్రేడ్ టాక్

ఈ సంక్రాంతికి మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, ఒక తమిళ అనువాద చిత్రం పోటీ పడ్డాయి. ఆ పోటీలో ‘క్రాక్’ యునానిమస్ హిట్ ‌గా నిలిచి…మొత్తానికి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా వచ్చిన క్రాక్ సినిమా మాస్ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్ అయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో రవితేజ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటికే లాభాల్లో […]

Written By:
  • admin
  • , Updated On : January 24, 2021 / 01:31 PM IST
    Follow us on


    ఈ సంక్రాంతికి మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, ఒక తమిళ అనువాద చిత్రం పోటీ పడ్డాయి. ఆ పోటీలో ‘క్రాక్’ యునానిమస్ హిట్ ‌గా నిలిచి…మొత్తానికి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా వచ్చిన క్రాక్ సినిమా మాస్ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్ అయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో రవితేజ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటికే లాభాల్లో దూసుకుపోతుంది.

    Also Read: ‘శాకుంతలం’ స్పీడ్ పెంచిన గుణశేఖర్

    ఇక సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన రెడ్ కు మొదటి రోజు నుండి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.రామ్ కి గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సూపర్ సక్సెస్ తో అభిమానుల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిన కారణంగానే ప్లాప్ టాక్ తెచ్చుకున్న రెడ్ కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి . ఏది ఏమైనా ఈ చిత్రంకు వచ్చిన స్పందనకు, వచ్చే కలెక్షన్స్ కు పొంతన లేదు. నెక్స్ట్ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వెళుతుందని తెలుస్తుంది.

    బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ మూవీ కూడా సంక్రాతి టైంలో రిలీజ్ అయ్యింది. అయితే సంక్రాంతికి బరిలో దిగిన పుంజులలో ఈ పుంజు మాత్రమే బాగా నెగటివ్ టాక్ తెచ్చుకుని కమర్షియల్‌గానూ వెనుకంజలో ఉండిపోయింది. ఈ చిత్ర యూనిట్ ప్రాఫిట్స్ లోకి వచ్చినట్లు ప్రచారాలు బాగానే చేస్తున్నారు గాని నిజంగా అయితే రాలేదని సమాచారం. నష్టాలతోనే ఈ మూవీ రేస్ ని ముగించేలా ఉంది.

    Also Read: కేజీఎఫ్2కు హీరో యష్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

    సంక్రాంతికి తెలుగు సినిమాలతో పోటీ పడుతూ ఇళయదళపతి విజయ్‌, యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు అనువాద చిత్రం ‘మాస్టర్‌’. ఈ చిత్రం విడుదలైన తర్వాత మిశ్రమ టాక్‌ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్లలో మాత్రం దుమ్మురేపుతోంది. ఒక్క తమిళనాడులోనే తొలి వారంలో ఏకంగా రూ.100 కోట్ల మేర వసూలు చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. తెలుగులో కూడా మొదటి రోజునే పెట్టుబడిలో దాదాపుగా 75 శాతం వచ్చేసింది, కలెక్షన్ పరంగా ఈ సినిమా విజయ్ కి హిట్ గానే చెప్పుకోవాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్