https://oktelugu.com/

ఆస్ట్రేలియన్లు కరిగారు.. భారత క్రికెటర్లకు మనసు లేదా?

భారత్ లో కరోనా కల్లోలానికి అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు, గల్ఫ్ సహా ఆస్ట్రేలియా కూడా స్పందించి చేతనైన సాయం చేస్తున్నాయి. తమ వద్దనున్న ఆక్సిజన్, వైద్య పరికరాలు పంపిస్తున్నాయి.. ఇక ఐపీఎల్ లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ కూడా స్పందించి వెంటనే పీఎం కేర్స్ కు 50వేల డాలర్ల విరాళం ప్రకటించారు. విదేశీయుడైన పాట్ కమిన్స్ కరిగిపోయి దేశంలోని కరోనా తీవ్రత చూడలేక సాయం చేస్తే.. కోట్లు సంపాదిస్తున్న భారతీయ క్రికెటర్లు ఒక్కరు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 27, 2021 7:55 pm
    Follow us on

    భారత్ లో కరోనా కల్లోలానికి అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు, గల్ఫ్ సహా ఆస్ట్రేలియా కూడా స్పందించి చేతనైన సాయం చేస్తున్నాయి. తమ వద్దనున్న ఆక్సిజన్, వైద్య పరికరాలు పంపిస్తున్నాయి.. ఇక ఐపీఎల్ లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ కూడా స్పందించి వెంటనే పీఎం కేర్స్ కు 50వేల డాలర్ల విరాళం ప్రకటించారు. విదేశీయుడైన పాట్ కమిన్స్ కరిగిపోయి దేశంలోని కరోనా తీవ్రత చూడలేక సాయం చేస్తే.. కోట్లు సంపాదిస్తున్న భారతీయ క్రికెటర్లు ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    మన భారత క్రికెటర్లు యాడ్స్ సహా క్రికెట్ ద్వారా ప్రపంచంలోనే ఏ క్రికెటర్ సంపాదించనంత సొమ్ము ప్రతీయేట ఆర్జిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంపాదన పరుల్లో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిలున్నారు. ఇక మాజీ క్రికెటర్లు కోట్లకు పడగలెత్తినవారే..

    అన్ని కోట్లు కూడా దేశం కరోనాతో అల్లాడుతుంటే రూపాయి విదిల్చని భారత క్రికెటర్ల తీరుపై దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వీరినా మేం ఆరాధించేది? వీరికోసమా తాము పనులన్నీ వాయిదావేసి క్రికెట్ చూసేది అని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.

    ఇప్పటిదాకా ఏ భారత క్రికెటర్ కూడా కరోనాతో అల్లాడుతున్న దేశ ప్రజలను ఆదుకునేందుకు సాయం ప్రకటించలేదు. కనీసం విదేశీ క్రికెటర్ పాట్ కమిన్స్ విరాళం ఇచ్చాక కూడా మన క్రికెటర్ల మనసు కరగలేదని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. వీరిది పాషాన హృదయాలా? అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

    ఐపీఎల్ పేరిట ఇప్పటికే బీసీసీఐ వేల కోట్లు సంపాదిస్తోంది. వేలం వెర్రిలో ఆటగాళ్లపై కోట్లు కుమ్మరిస్తున్నాయి ఫ్రాంచైజీలు.. ప్రతీ ఆటకు కోట్లు కురుస్తున్నాయి. ఇంతటి ఖరీదైన లీగ్ ఐపీఎల్ నుంచి.. బీసీసీఐ నుంచి కూడా దేశ ప్రజలకు ‘స్టే సేఫ్.. స్టే హోమ్’ అన్న నినాదం తప్పితే ప్రజలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్న మాట వినిపించడం లేదు. దేశంలో ఓ వైపు చావులతో మరణ మృదంగం వినిపిస్తుంటే ఐపీఎల్ ఆటలో ఎంజాయ్ చేస్తున్న తీరుపై పలువురు మేధావులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.